Begin typing your search above and press return to search.
కరోనా కట్టడికి ‘అప్లైడ్’ ప్లాన్ ఇదే.. మోదీ ఏమంటారో?
By: Tupaki Desk | 7 April 2020 3:30 AM GMTయావత్ ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. భారత్ లాంటి దేశాల్లో లాక్ డౌన్ కట్టుదిట్టంగానే అమలవుతోంది. అయితే ఈ లాక్ డౌన్ తో కరోనా కట్టడి సాధ్యమేనా? సాధ్యం కాకపోతే ఇంకేం చేయాలి? ఈ దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు దృష్టి సారించేసిందనే చెప్పాలి. అయితే వైరస్ వల్ల జరిగే ప్రమాదం - వైరస్ వ్యాప్తి - లాక్ డౌన్ తో వైరస్ వ్యాప్తి ఏ మేర తగ్గింది? లాక్ డౌన్ ఎత్తేయగానే జరిగే ప్రమాదం ఏమిటి? కరోనాను పూర్తిగా - నామరూపాల్లేకుండా కట్టడి చేయాలంటే ఏం చేయాలి? తదితర అంశాలపై తనదైన శైలి అంచనాతో అప్లైడ్ మ్యాథమ్యాటిక్స్ అండ్ థియరిటికల్ ఫిజిక్స్ విభాగం ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. ఈ విభాగానికి చెందిన నిపుణులు ఆర్. అధికారి - రాజేష్ సింగ్ లు విడుదల చేసిన ఈ అధ్యయనం దేశ ప్రజలతో పాటు మోదీ సర్కారును కూడా ఆలోచనలో పడేసే దిశగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న 21 రోజుల లాక్ డౌన్ మరో 9 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో విడుదలైన ఈ అధ్యయనం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే... ప్రస్తుత లాక్ డౌన్ వల్ల జరిగిన లాభం - లాక్ డౌన్ ఎత్తేయగానే జరిగే నష్టం తదితరాలను క్రోడీకరించి మరీ విడుదల అయిన ఈ అధ్యయనం నిజంగానే ఆసక్తికరమేనని చెప్పక తప్పదు. అయినా ఈ అధ్యయనంలో ‘అప్లైడ్’ శాస్త్రవేత్తలు ఏమని సూచించారంటే... ప్రస్తుతం కొనసాగుతున్న 21 రోజుల లాక్ డౌన్.. కరోనా కట్టడికి ఏమాత్రం సరిపోదని వారు చెబుతున్నారు. మరో రెండు లాక్ డౌన్లతో నే కరోనాను పూర్తి స్థాయిలో నిరోధించడం సాధ్యపడుతుందని కూడా వారు చెబుతున్నారు. అయితే ఇప్పటి లాక్ డౌన్ కు తదనంతర లాక్ డౌన్ కు ఐదు రోజుల విరామం - ఆ తర్వాత రెండు లాక్ డౌన్ల మధ్యలో మరో ఐదు రోజుల విరామం పాటిస్తే... వైరస్ ను పూర్తి స్థాయిలో పారదోలవచ్చని వారు చెబుతున్నారు.
కోవిడ్-19 కట్టడికి ప్రఃస్తుతం అమలులో ఉన్న 21 రోజుల లాక్ డౌన్ సరిపోదని వారు అభిప్రాయపడ్డారు. మార్చి 25న ప్రధాని పిలుపునిచ్చిన లాక్ డౌన్ మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. లాక్ డౌన్ పరిస్థితులపై తమ అధ్యయనంలో నాలుగు అంశాలను వెల్లడించారు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. 21 రోజుల లాక్ డౌన్ తో వైరస్ బారిన పడేవారి సంఖ్య తగ్గింది. అయితే, రోజురోజుకీ కేసుల పెరుగుదల చూస్తే ఇది పూర్తిగా సఫలం అయిందని అని చెప్పలేం. ప్రస్తుత లాక్ డౌన్ ను తొలగించగానే వైరస్ విజృంభణ తీవ్రమవుతుంది.
2. ప్రస్తుత లాక్ డౌన్ కు 5 రోజుల పాటు విరామమిచ్చి 28 రోజలు పాటు మరో లాక్ డౌన్ ను ప్రకటించడం. ఇది కూడా కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుందని చెప్పలేం.
3. ఇది మూడు లాక్ డౌన్ లను సూచిస్తుంది. మొదటిది 21 రోజులు.. అనంతరం ఐదు రోజుల విరామం.. మళ్లీ 28 రోజుల లాక్ డౌన్.. 5 రోజుల విరామం.. చివరగా 18 రోజుల లాక్ డౌన్. ఇలా చేస్తే వైరస్ సంక్రమణ కేసుల్ని పదుల సంఖ్యలోనే కట్టడి చేయొచ్చు.
4. చివరిది. కానీ ముఖ్యమైంది. ఏకధాటిగా ప్రస్తుత లాక్ డౌన్ కాలాన్ని 49 రోజులకు పొడిగించడం. దీనివల్ల కూడా వైరస్ సంక్రమణను అడ్డుకోవచ్చు. పదుల సంఖ్యకే కేసులను పరిమితం చేయొచ్చు.