Begin typing your search above and press return to search.
దేశంలోనే ఫస్ట్..విశాఖలో 4డీ థియేటర్
By: Tupaki Desk | 4 Jan 2017 10:00 AM GMTఉక్కు నగరం విశాఖ మరో ప్రత్యేకతకు కేంద్రం కానుంది. ఇన్నాళ్లూ 3డీ చిత్రాల వీక్షణకే పరిమితమైన ప్రజలకు 4డీ సాంకేతిక సౌలభ్యం అందుబాటులోకి రాబోతోంది. విశాఖలో 4డీ థియేటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విశాఖ జంతుప్రదర్శన శాలలో ఈ థియేటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే దేశంలోనే తొలి 4డి థియేటర్ గుర్తింపు పొందనుంది. అటవీశాఖ అధ్వర్యంలో పనిచేస్తున్న అప్కాస్ట్ సంస్థ (ఏపీ కౌన్సిల్ ఫర్ సైన్స్ ఆండ్ టెక్నాలజీ) ఆధ్వర్యంలో థియేటర్ ను ఏర్పాటు చేయనున్నారు.
పార్కులు - మ్యూజియం చరిత్ర - అప్కాస్ట్ - ఓషన్ సెంటర్ వంటి వాటిని లోతుగా అధ్యయనం చేసేందుకు, ఉల్లాసభరిత వాతావరణంలో దృశ్యాలను వీక్షించడంతో పాటు మూడు రకాల అనుభూతులను ఆస్వాదించేందుకు 4డి థియేటర్లో అవకాశం ఉంటుంది. 3డీ విధానంలో కేవలం వీక్షించేందుకు మాత్రమే అవకాశం ఉండగా, 4డి విధానంలో వీక్షణతోపాటు - కనిపిస్తున్న వాటి సువాసనలు అనుభవించేలా - స్పర్శానుభూతి కూడా పొందవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి థియేటర్ దేశంలో లేదని - సింగపూర్ - సిడ్నీల్లో ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. థియేటర్ స్క్రీన్ పై వర్షం పడుతుంటే... ప్రేక్షకులపై కూడా చిరు జల్లులు పడతాయని, ఆహార పదార్థాలు కనిపిస్తే వాటి స్పష్టమైన సువాసనలు కూడా ప్రేక్షకులకు తెలుస్తాయని అధికారులు వివరించారు. ముందుగా దీనిని విజయవాడలోని అప్కాస్ట్ కార్యాలయంలోనే ఏర్పాటు చేయాలని భావించిన అధికారులు మూడేళ్ల కిందటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటివరకూ ఆ ఫైలుకు కేంద్రంలో మోక్షం లభించలేదు. రాష్ట్ర అధికారులు కూడా దాదాపు మరచిపోయారు కూడా. అయితే థియేటర్ ను విజయవాడలో కంటే పర్యాటక ప్రాంతమై విశాఖలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని గుర్తించిన ఉన్నతాధికారులు తాజాగా నూతన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖలోని జంత్రుప్రదర్శనశాలలో థియేటర్ ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
4డీ థియేటర్ ఏర్పాటుకు కేవలం 2.5 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని - ఐదెకరాల స్థలం సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. జూలో ఈ సౌకర్యాలు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. అలాగే భీమిలి - విశాఖ బీచ్ - రిషికొండ సమీపంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు అనునిత్యం సందర్శకులు వస్తుంటారని, అందుకే విశాఖ జూలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందని, సీఎం ఆమోదం లభించిన వెంటనే నిధులు- అనుమతుల కోసం కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/