Begin typing your search above and press return to search.
కారు సీటు కింద 5 కోట్లు.. కలకలం..
By: Tupaki Desk | 4 Dec 2018 5:33 AM GMTతెలంగాణ ఎన్నికలకు వేళయ్యింది. ఈనెల 7న పోలింగ్ జరగనుంది. 5 న సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో భారీగా కరెన్సీ కట్టల పాములు బయటపడుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. కోట్ల రూపాయలను పంచేందుకు స్కెచ్ గీసి చెక్ పోస్టులు దాటిస్తున్నారు.
తాజాగా జనగామా జిల్లాలో 5 కోట్ల రూపాయలు కారులో పట్టుబడడం కలకలం రేపింది. పెంబర్తి చెక్ పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ నగదు పట్టుబడింది. అర్ధరాత్రి 1.30 నుంచి 2.00 గంటల మధ్య హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న స్విఫ్ట్ కారులో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు.
కారు లోపల, వెనుక డిక్కీలో మొదట చెక్ చేసిన పోలీసులకు కరెన్సీ కనిపించలేదు. కానీ అనుమానం వచ్చి కారు వెనుక సీటు కింద తనిఖీ చేయగా.. కరెన్సీ కట్టలు కనిపించాయి. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు కర్సెనీని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. లెక్కించగా రూ.5 కోట్లుగా లెక్క తేలింది. ఈ డబ్బు ఎవరిది.? ఎవరు తరలిస్తున్నారన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు