Begin typing your search above and press return to search.
భారీ కాల్ సెంటర్ స్కాం వెలుగులోకి..
By: Tupaki Desk | 8 Sep 2018 12:00 PM GMTమధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కేంద్రంగా భారీ నకిలీ కాల్ సెంటర్ కుంభకోణం కలకలం రేపింది. ఈ తాజా స్కాంలో అహ్మదాబాద్ లోని 5 కాల్ సెంటర్ ఆపరేటర్లు - మరో ఏడుగురు వ్యక్తులు పాలుపంచుకున్నారు. వీరు 2వేలకు పైగా అమెరికన్లను నిలువునా ముంచేసినట్టు తేలింది. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం తాజాగా ఒక ప్రకటన జారీ చేయడం విశేషం. ఏడుగురు బాధితులతో సహా 15మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈ స్కాంలో దాదాపు 5.5 మిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్టు వెల్లడించింది.
ఈ స్కామ్ కు సంబంధించి అమెరికాలో ఏడుగురిని అరెస్ట్ చేశారు. 2012 - 2016 మధ్యకాలంలో అంతర్గత రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ ఎస్) లేదా పే డే రుణాల బాధితులను మోసగించారని అటార్నీ బైయుంగ్ జే పాక్ తెలిపారు. రుణాలు చెల్లించకపోతే అరెస్ట్ - జైలు శిక్ష - పన్ను ఎగవేత జరిమానాల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. ముఖ్యంగా ఎక్సలెంట్ సొల్యూషన్స్ - ఏడీఎస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫోస్ బీపీవో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - ఆడోర్ ఇన్పోసార్స్ - సురిక్ బీపీవో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఇందులో ఉన్నాయని తెలిపారు.