Begin typing your search above and press return to search.

కరోనా : యూరప్ లో మూడు నెలల్లో 5 లక్షల మరణాలు

By:  Tupaki Desk   |   5 Nov 2021 12:30 PM GMT
కరోనా : యూరప్ లో మూడు నెలల్లో 5 లక్షల మరణాలు
X
కరోనా కల్లోలం అన్ని దేశాల కంటే యూరప్ పై తీవ్ర ప్రభావం చూపించింది. జనాభా ఎక్కువగా ఉండే యూరప్ లోని బ్రిటన్ ను అతలాకుతలం చేసింది. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై గుత్తాధిపత్యం చెలాయించి ఆ దేశాలను దోపిడీ చేసి సంపద పోగేసుకున్న బ్రిటన్ దేశం కేవలం ఒక్క కరోనా దెబ్బకు కుదేలైంది. త ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మూడు శతాబ్ధాల కంటే తక్కువకు దిగజారిందని సంచలన నిజాలు వెల్లడించింది.

మొదటి వేవ్ కు చిగురుటాకులా వణికిన యూరప్ దేశాలు ఇప్పుడు చలికాలం రావడంతో మరోసారి వణికిపోతున్నాయి. తాజాగా యూరప్ మరోసారి కరోనా మహమ్మారికి కేంద్రంగా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ హెచ్చరించారు.

జర్మనీలో ఇంకా కోటి 60 లక్షల మంది టీకా వేసుకోలేదని తేలింది. గతంతో పోలిస్తే ఐసీయూ వరకూ వచ్చిన కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. తాజాగా జర్మనీలో గత 24 గంటల్లో దాదాపు 34వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అత్యధికం. దీంతో వ్యాక్సిన్ వేసుకోని వారికి ఇది భారీ మహమ్మారి అవుతుంది అని ఆ దేశ ఆరోగ్యశాఖా మంత్రి అన్నారు.

యూరప్ లో ఫిబ్రవరిలోపు కరోనా వ్యాప్తి వల్ల మరో 5 లక్షల మరణాలు నమోదు కావచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ యూరప్ డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం పట్ల తీసుకోవాల్సిన చర్యలను సడలించడం కూడా యూరప్ లో కేసుల పెరుగుదలకు ఒక కారణం అని తేలింది. ప్రజారోగ్యం పట్ల తీసుకోవాల్సిన చర్యలను సడలించడం కూడా యూరప్ లో కేసుల పెరుగుదలకు ఒక కారణం అని ఆయన అన్నారు.

మధ్య ఆసియా సహా 53 దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ 14 లక్షల మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో సగానికి పైగా కేసులు యూరప్ లో వెలుగులోకి వచ్చాయి. దాదాపు సగం మరణాలు సంభవించాయి. యూరప్ లోని 53దేశాల్లో ప్రస్తుతం కోవిడ్ వ్యాపిస్తున్న వేగం ఆందోళనకంగా ఉందని తేలింది.

ఈ క్రమంలోనే యూరప్ అంతటా వ్యాక్సినేషన్ వేగం పెంచాలని.. కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి సామాజిక దూరం కొనసాగించాలని మాస్క్ ధరించడం ముఖ్యమని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగం యూరప్ ను హెచ్చరించింది.