Begin typing your search above and press return to search.
టీటీడీ బరిలో ఆ నలుగురు..ఒత్తిడిలో బాబు
By: Tupaki Desk | 20 Jan 2018 12:22 PM GMTసుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ పదవికి లేని విధంగా టీటీడీ దేవస్థానం చైర్మన్ పదవికి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ప్రధానంగా నలుగురి పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. చైర్మన్ పదవి కోసం టీడీపీ ఎంపీలు రాయపాటి సాంబశివరావు - మురళీమోహన్ తో పాటు తాజాగా సినీ దర్శకులు రాఘవేంద్రరావు - వైఎస్సార్ కడప జిల్లా నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ - నెల్లూరు నుంచి బీదా మస్తాన్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయని మీడియాలో జోరుగు ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ - బీజేపీ మిత్రబంధం కారణంగా నియామకం విషయంలో అస్పష్టత నెలకొందని అంటున్నారు.
టీటీడీ చైర్మన్ పదవి నియామకంలో సమీకరణలు - లెక్కలు కుదరకనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటూ తేల్చడం లేదంటున్నారు. ఈ పదవి విషయంలో తీవ్ర ఒత్తిడి వస్తుండడంతో ఎవరికీ కట్టబెట్టాలనే విషయంలో ప్రభుత్వంలో మీమాంస నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా పార్టీ సీనియర్ నాయకులు - పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు ఈ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పదవి తనకిస్తే అవసరమైతే తన ఎంపీ పదవిని సైతం వదులుకుంటానని కూడా సాంబశివరావు గతంలోనే స్పష్టంచేశారు. ఇటీవల కూడా ఆ వేంకటేశ్వరుడే తనకు న్యాయం చేస్తాడని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పదవులున్న వారికి నామినేటెడ్ పదవి ఇవ్వడం కుదరదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పడంతో ఒకింత ఆయన నొచ్చుకోవడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన ఈ పదవి కోసమే ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఆయనతోపాటు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా ఈ పదవిని ఆశించారు. తర్వాత చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కృష్ణమూర్తి తదితరులు పదవిని ఆశించి - విజయం సాధించలేకపోయారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ను ప్రభుత్వం నియమించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆయనకు క్రైస్తవ మతంతో సంబంధాలు ఉన్నాయని, ఈ పదవిని చేపట్టేందుకు నిబంధనలు అంగీకరించవని తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ఆయన నియామకాన్ని నిలిపేసింది. దీంతో ఆయన నియామకంతో పాటు సభ్యుల నియామకాలు కూడా నిలిచిపోయాయి. దీంతో మళ్లీ వ్యవహారం మొదటికే వచ్చింది. చివరికి ఈ పదవిలో ఎవర్నీ నియమించ కుండానే బ్రహోత్సవాలు కూడా జరిగిపోయాయి. అయితే సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పేరు కూడా జోరుగా వినిపిస్తోంది.
అయితే తాజాగా నియమకానికి సీఎం చంద్రబాబు ఓకే చెప్పేసిన నేపథ్యంలో ఇటు బీజేపీతో పాటు అటు టీడీపీ నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. బోర్డు సభ్యుడి పోస్ట్ కోసం తమదైన శైలిలో టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు - ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావుతో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. స్థూలంగా ఇటు స్వపక్షం, అటు మిత్రపక్షం నుంచి ఒత్తిల్లు వస్తున్న నేపథ్యంలో బాబు ఈ నియామకానికి బ్రేక్ వేసినట్లు సమాచారం.