Begin typing your search above and press return to search.
వలస కార్మికులను వెంటాడిన మృత్యువు
By: Tupaki Desk | 10 May 2020 4:09 AM GMTఉపాధినిచ్చిన ఊరు పనిలేక పొమ్మంది. కన్నఊరికి వెళదామని బయలు దేరిన వారిని మృత్యువు కబళించింది. అంతిమంగా వలస కూలీల బతుకులు ఎంత దుర్భరమో ఈ సంఘటన చాటి చెప్పింది.
లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి..ఆకలి కేకలు భరించలేక సొంతూళ్లకు బయలుదేరిన వలస కార్మికులు ఇంటికి చేరేలోపే అసువులు బాస్తున్న దైనం తాజాగా వెలుగుచూస్తోంది. ఇటీవల మహారాష్ట్ర ఔరంగాబాద్ లో 15మంది రైల్వే ట్రాక్ పై పడుకున్నకూలీలు విగతజీవులయ్యారు. తాజాగా మరో ప్రమాదంలో వలసకార్మికులు అసువులు బాసారు.
హైదరాబాద్ లో పనిచేసుకుంటున్న వలస కార్మికులు లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోవడంతో హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన 18మంది వలస కార్మికులు హైదరాబాద్ నుంచి మామిడి పండ్ల లోడుతో బయలుదేరిన లారీ ఎక్కారు. శనివారం ఉదయం బయలుదేరిన ఈ లారీ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు వెళ్లాల్సి ఉంది.
మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ జిల్లా పథా గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ మామిడి పండ్ల లోడుపై కూర్చొని ప్రయాణిస్తున్న వలస కార్మికులు ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న నర్సింగ్ పూర్ కలెక్టర్ దీపక్ సక్సేనా.. పోలీసులు మృతదేహాలను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో జబల్ పూర్ పెద్దాసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారి మృతదేహాల శాంపిళ్లను తీసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.