Begin typing your search above and press return to search.

వచ్చే 30 రోజుల్లో 5 లక్షల మందికి వైరస్ !

By:  Tupaki Desk   |   11 May 2020 9:30 AM GMT
వచ్చే 30 రోజుల్లో 5 లక్షల మందికి వైరస్ !
X
మహమ్మారి వైరస్ దేశంలో రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. దాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ కూడా ఈ వైరస్ కేసులు తగ్గడంలేదు. దేశంలో ఈ మహమ్మారి కేసుల సంఖ్య 67 వేలు దాటేసింది. మహమ్మారికి కాటుకు బలైన వారి సంఖ్య రెండు వేల రెండు వందలు దాటేసింది. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 2,213 కాగా, మహారాష్ట్ర - తమిళనాడు - గుజరాత్ లలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

కాగా, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటి పోయింది. ఆ రాష్ట్రంలో కరోనా కాటుకు ఇంత వరకూ 779 మంది మరణించారు. అలాగే తమిళనాడులో కూడా కరోనా ఉధృతి ఆందోళన కర స్థాయిలో ఉంది. ఇక గుజ‌రాత్‌ లోనూ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. అహ్మదాబాద్ ‌లో పరిస్థితి భయానకంగా ఉంది. గుజరాత్‌ లో మే 10న‌ ఒక్క రోజే 398 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8195కు చేరుకుంది. గుజరాత్‌ లో కరోనా కారణంగా ఇప్పటివరకు 493 మంది మరణించారు. ముఖ్యంగా అహ్మదాబాద్‌ లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మొత్తం కేసుల్లో సుమారు 6 వేల కేసులు ఇక్కడే నమోదయ్యాయి. తాజాగా అధికారులు ఇక్కడ 334 మంది సూపర్ స్ప్రెడర్స్‌ ను గుర్తించారు. అహ్మదాబాద్ ‌లో 14 వేల మంది సూపర్‌ స్ప్రెడర్స్‌ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారులు ఇప్పటికే వీరి వివరాలు సేకరించారు. మూడు రోజుల పాటు వారందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ప్రజలు ఆరుబయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. అయితే, ఒక సర్వే ప్రకారం... ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే, వచ్చే 30 రోజుల్లో మన దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదున్నర లక్షలు వుంటుందని నిపుణుల అంచనా.