Begin typing your search above and press return to search.
5 గంటలకంటే తక్కువ పడుకుంటే డేంజర్!
By: Tupaki Desk | 23 Sep 2019 5:08 AM GMTకాలం మారింది.. కాలంతో పాటు మనిషి మారాడు.. ఇప్పుడు రాత్రి 1 - 2 - 3 గంటలైన నిద్రపోని వారు ఎంతో మంది.. స్మార్ట్ ఫోన్ లో పడి రాత్రంతా జాగారం చేసే యువత కోకోల్లలు. నిద్రలేమీ ఇప్పుడు అందరికీ ప్రధాన సమస్యగా మారింది. కాలక్షేపం కోసం రాత్రుళ్లు ఫోన్ లో మునిగిపోతే తెల్లవారుజాము వరకూ దాని నుంచి బయటపడిన వారు ఎందరో..
తాజాగా నిద్రలేమీతో భయంకర వ్యాధులు చుట్టుముడుతాయని అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. వీరు అధ్యయనంలో భాగంగా 15 మంది యువకులను పదిరోజుల పాటు రోజు 5 గంటలకు మించి నిద్ర పోనివ్వలేదు. అనంతరం వారి శరీరంలో పరీక్షించగా.. గ్లూకోజ్ - కొవ్వు పదార్థాల స్థాయి పెరిగింది. అంతేకాదు.. జీవక్రియల రేటు ఒక్కసారిగా హెచ్చుతగ్గులకు గురికావడాన్ని గుర్తించారు.
ఈ నిద్రలేమీ కారణంగా జీవక్రియ దెబ్బతిని గ్లూకోజ్ - కొవ్వు పదార్థాల స్థాయి పెరిగి షుగర్ - స్థూలకాయం వంటి సమస్యలు దాపురిస్తాయని తేల్చారు. సో 5 గంటల నిద్రతో ఎన్నో అనర్థాలని కనీసం 8 గంటలు నిద్ర తక్కువ కాకుండా చూసుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మీరు డయాబెటిస్ తోపాటు లావెక్కుతున్నారంటే అది ఖచ్చితంగా నిద్రలేమీతో వచ్చిందని హెచ్చరిస్తున్నారు..