Begin typing your search above and press return to search.
ముస్లింల కు 5% రిజర్వేషన్.. శివసేన అంగీకరిస్తుందా ?
By: Tupaki Desk | 14 Nov 2019 11:39 AM GMTహిందుత్వ శివసేన ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మహారాష్ట్ర లో కలిసి పోటీచేసిన బీజేపీ తో తెగ తెంపులు చేసుకుంది. సీఎం కుర్చీ కోసం సామీప్యత గల బీజేపీ ని దూరం పెట్టింది. ఇప్పుడు కార్నర్ లో ఉన్న శివసేన.. కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. అయితే పక్కా హిందుత్వ శివసేన తో కలిస్తే తమకు అనాది గా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందని కాంగ్రెస్ దూరంగా పెడుతోంది.
ఇప్పుడు శివసేన పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది.. మహారాష్ట్ర లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న శివసేన ఈ మేరకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు కోరుతోంది. అయితే శివసేన కు మద్దతు ఇవ్వాలంటే తమ రెండు షరతులను అంగీకరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అవి అంగీకరిస్తే శివసేన పార్టీ తన ప్రాథమిక హిందుత్వ సూత్రాల ను వదులుకోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.
కాంగ్రెస్ తో కలువాలంటే ముస్లింల కు 5శాతం రిజర్వేషన్లను ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ని శివసేన అమలు చేయాలి. దీన్ని శివసేన ఎప్పటి నుంచో తీవ్రం గా వ్యతిరేకిస్తోంది. ఇక కాంగ్రెస్ రెండో డిమాండ్ ఏంటంటే స్వాతంత్ర్య సమర యోధుడు, వీర్ వినాయక్ దామోదర్ సావర్కర్ కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ నుంచి వెనక్కి తగ్గాలి.
ఈ రెండు కాంగ్రెస్ డిమాండ్ల ను అంగీకరించే పరిస్థితుల్లో శివసేన లేదు. అంగీకరిస్తే అనాధి గా అండగా ఉన్న హిందుత్వ ఓటర్ల ను వదులుకోవాలి. గుజరాతీ, దక్షిణ మహారాష్ట్ర లో బలం పూర్తి గా కోల్పోతుంది. దీంతో శివసేన పొత్తు కోసం అధికారం కోసం హిందుత్వ సూత్రాలను విస్మరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.