Begin typing your search above and press return to search.

5 రాష్ట్రాల ఎన్నికలు: ఓడిన ప్రముఖులు

By:  Tupaki Desk   |   11 March 2022 2:30 AM GMT
5 రాష్ట్రాల ఎన్నికలు: ఓడిన ప్రముఖులు
X
ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజం. అయితే నేతలకు కొన్ని కంచుకోటలు ఉంటాయి. ఎన్నికల్లో అవి కూడా బద్దలవుతుంటాయి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు పీఎంలు, సీఎంలు కూడా ఓడిపోతారు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా మంది సీట్లు గల్లంతయ్యాయి. ప్రముఖులు హేమాహేమీలంతా ఓడిపోయారు.

5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఉత్తర ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్ లో బీజేపీ విజయం సాధించగా పంజాబ్ లో ఆప్ విజయకేతనం ఎగురవేసింది. ఇక గోవాలో కాంగ్రెస్ -బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇద్దరూ ఓటమి పాలయ్యారు. తన ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా చేశారు.

ఇక పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి సీఎంగా నిన్నటి వరకూ చేసిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రెండుచోట్ల పోటీచేయగా.. రెండూ చోట్ల ఘోరంగా ఓడిపోయారు. ఇక సిద్దూ, అమరీందర్ సింగ్ సైతం ఓడిపోయారు.

ఇక శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ సైతం ఓడిపోయారు. ఇక రియల్ హీరో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ సైతం ఓడిపోయారు. ఆమె కాంగ్రెస్ నుంచి పోటీచేశారు.

ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి వెనుకబడ్డారు. ఓట్ల లెక్కింపులో దాదాపు ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఇక కాంగ్రెస్ మాజీ సీఎం హరీష్ రావత్ సైతం ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.

ఇక గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ ఓటమి పాలయ్యారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఉత్పల్ పారికర్.. పనాజీ అసెంబ్లీ స్థానం స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. బీజేపీ అభ్యర్థి ఏబీపీ మజ్హా చేతిలో 800ఓట్ల తేడాతో ఓడిపోయారు.