Begin typing your search above and press return to search.
వెంకన్న డబ్బును చెల్లని కాసులుగా మార్చిన టీటీడీ
By: Tupaki Desk | 29 Aug 2018 1:30 AM GMTటీటీడీ అధికారుల నిర్లక్ష్యం తిరుమల వెంకన్న డబ్బును పనికి రాకుండా చేసింది. టన్నులకొద్దీ నాణేలను సకాలంలో మార్చకపోవడంతో అవన్నీ చెల్లనికాసులుగా మిగిలిపోయాయి.
టీటీడీ వద్ద మలేషియా నాణేలు 40 టన్నులు - స్వదేశీ నాణేలు 35 టన్నులకుపైగా ఉన్నాయి. వీటిలో అత్యధికం చెలామణీలో లేని నాణేలు. 2011లో 25 పైసలు - అంతకన్నా తక్కువ నాణాలను చలామణి నుంచి తొలగించి - ఆపై 2014 ఫిబ్రవరి వరకూ ఆ నాణాలను మార్చుకోవాలని ఆర్బీఐ ఆదేశించినా - తిరుమల అధికారులు మాత్రం పట్టించుకోలేదు. గడువు ముగిసిన తరువాత - ఆ నాణాలను తీసుకునేందుకు బ్యాంకులు నిరాకరించాయి.
ఇక మలేషియా నాణాల విషయంలోనూ ఇదే పరిస్థితి. మలేషియా రింగెట్లను 2005లో చలామణి నుంచి తొలగించగా, వాటిని మార్చుకోవాలని టీటీడీ భావించలేదు. దీంతో 40 టన్నుల రింగెట్లు టీటీడీ వద్ద పేరుకుపోయాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత, హుండీలో పడిన రూ. 40 కోట్ల పాత నోట్లను కూడా సరైన సమయంలో మార్చుకోని విషయం తెలిసిందే.
అయితే... ఇప్పుడీ 75 టన్నుల చెల్లని నాణేలను డబ్బు రూపంలో మార్చుకోవడానికి టీటీడీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అందులో భాగంగానే తమ వద్ద మిగిలిపోయిన నాణాలను కరిగించి, ఆ లోహానికి సమానమైన డబ్బు ఇవ్వాలని సెయిల్‌ను కోరింది. కానీ, నగదు ఇచ్చేందుకు సెయిల్ అంగీకరించలేదు. తాము డబ్బివ్వలేమని, అందుకు ప్రతిగా, టీటీడీ ఏదైనా యంత్ర పరికరాలను ఆర్డర్ ఇస్తే, డబ్బు తీసుకోకుండా బిల్లులో సర్దుబాటు చేస్తామని చెప్పింది.