Begin typing your search above and press return to search.

ముద్రగడే మొదటి ముద్దాయి

By:  Tupaki Desk   |   3 Feb 2016 8:51 AM GMT
ముద్రగడే మొదటి ముద్దాయి
X
మొన్న ఆదివారం తునిలో జరిగిన కాపు గర్జన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు లెక్కలు తేలుస్తున్నారు. ఆ రోజు సభలో ఏం జరగింది... ఎక్కడెక్కడ నుంచి వచ్చారు.. వంటి సమాచారం తెలుసుకుంటున్నారు. టోల్ గేట్ల వద్ద నిఘా కెమేరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా సభకు వచ్చిన వాహనాలు అందులో మనుషులు.. వారిలో నేరచరితులు ఇలా స్టెప్ బై స్టెప్ లెక్క తేలుస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 70 మందిపై కేసులు పెట్టారు. గర్జన నిర్వహించిన ముద్రగడ పద్మనాభాన్ని ఏ1 నిందితుడిగా కేసు పెట్టారు.

తుని రూరల్ పోలీస్ స్టేషన్లో 57 కేసులు, టౌన్ పోలీస్ స్టేషన్లో 7, రైల్వే కేసులు మూడు నమోదు చేశారు. మొత్తం 67 మంది పైన కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. ముద్రగడను ఏ1 నిందితుడిగా పేర్కొంటూ కేసులు నమోదయ్యాయి. తుని ఘటనకు సంబంధించి ఓ మీడియా సంస్థ అధినేత సుధాకర్ నాయుడు, గర్జన స్థల యజమాని రాజా చినబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పల్లం రాజు, వట్టి వసంత్ కుమార్, సి రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, స్థానిక నేతలుపైనా కేసు నమోదు చేశారు.

కాగా 'కాపు గర్జన'... సభ నిర్వహణకు స్థలం ఇచ్చిన రాజా చినబాబుకు చిక్కుల్లో పడ్డారు. తునిలో కాపు గర్జనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో రాజా చినబాబు అనే వ్యక్తకి చెందిన ప్రయివేటు స్థలాన్ని ముద్రగడ ఎంచుకున్నారు. అయితే విధ్వంసం నేపథ్యంలో పోలీసులు ప్రయివేటు స్థలం యజమాని రాజా చినబాబు పైన కూడా కేసు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రకు సహాయసహకారాలు అందించారని అతనికి నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది. దీనిపై రాజా చినబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే.... చినబాబుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని ముద్రగడ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.