Begin typing your search above and press return to search.
షాక్ : ప్రైవేట్ ఏజెన్సీ దగ్గర 50 కోట్ల ఫేస్ బుక్ ఫోన్ నెంబర్లు
By: Tupaki Desk | 27 Jan 2021 1:30 AM GMTప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా లో మునిగితేలుతున్నారు. వయస్సు తో సంబంధం లేకుండా చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియా లోనే కాలం గడిపేస్తున్నారు. ఇక పేస్ బుక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే , పేస్ బుక్ యూజర్లకి ఈ మధ్య వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
500 మిలియన్లకు పైగా వినియోగదారుల ఫోన్ నంబర్లు ఎన్ క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ టెలిగ్రామ్ లో బోట్ ద్వారా అమ్ముడవుతున్నాయి. ఇది 2019 లో ఫేస్ బుక్ లో లీక్ అయిన ఒక పాచ్ ద్వారా విషయం వెలుగులోకి వచ్చినట్టు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది.
దీంతో సోషల్ మీడియాలో వినియోగదారుల గోప్యత, సెక్యూరిటీపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మదర్ బోర్డులోని ఒక నివేదిక ప్రకారం, 533 మిలియన్ యూజర్ల ఫోన్ నంబర్లు బహిర్గతమైనాయి. ఇందులో సుమారు 6 లక్షల మంది భారతీయ వినియోగదారుల మొబైల్ నెంబర్లు చోరీకి గురయ్యాయి. యూజర్ కు చెందిన ఒక్కో ఫోన్ నంబర్ 20 డాలర్ల చొప్పున అమ్ముడు పోయింది. ఆటోమేటెడ్ టెలిగ్రామ్ బాట్ ను ఉపయోగించడం ద్వారా వినియోగదారుల ఫోన్ నెంబర్ల విక్రయిస్తున్నట్టు మదర్ బోర్డు రిపోర్ట్ చేసింది.
సైబర్ సెక్యూరిటీ సంస్థ హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అలోన్ గాల్ దీనికి సంబందించిన సమాచారంపై అప్రమత్తం చేశారని నివేదిక తెలిపింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలకు ఫేస్ బుక్ వినియోగదారులు ప్రభావితమయ్యారని అలోన్ వెల్లడించారు. బల్క్ గా 10,000 నెంబర్లకుగాను 5,000 డాలర్లకు విక్రయిస్తున్నారన్నారు. ఈ డేటా బేస్ విక్రయం చాలా అందోళన కలిగించే పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.
దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్ లను కూడా ఆయన షేర్ చేశారు. డేటా కొంచెం పాతదే అయినప్పటికీ, ఇప్పటికే ఫోన్ నంబర్లు చోరీ అయినవారి సైబర్ సెక్యూరిటీ , గోప్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే , ఫేస్ బుక్ గానీ, ఇటు టెలిగ్రామ్ గానీ ఈ నివేదికపై అధికారికంగా ఇంకా స్పందించలేదు. కాగా వాట్సాప్ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ విధానంపై యూజర్లు మండిపడున్నారు.
మరోవైపు వాట్సాప్, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌ను దేశంలో నిషేధించాలని కోరుతూ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా సీఏఐటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో పలు దేశాలు అమలు చేస్తున్న విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.