Begin typing your search above and press return to search.
కరోనా విలయం : ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది మృతి
By: Tupaki Desk | 2 Oct 2021 5:30 PM GMTగత ఏడాదిన్నరకి పైగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి, ఇప్పటివరకు అరకోటి మందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా వెలువడిన రాయిటర్స్ వార్తా సంస్థ విశ్లేషించిన గణాంకాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మరణాల సంఖ్య 50లక్షలు దాటింది. కరోనా వెలుగు చూసిన తొలి ఏడాదిలో 25లక్షల మంది వైరస్ కారణంగా మరణించారు. మరో 25లక్షల మరణాలు కేవలం 236 రోజుల్లోనే సంభవించాయి. చాలా దేశాల్లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంటే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాల్లో సగానికి పైగా కేవలం ఐదు దేశాల్లోనే నమోదయ్యాయి. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక మరణాలు చోటుచేసుకోగా, ఆ తర్వాత రష్యా, బ్రెజిల్, మెక్సికో, భారత్ దేశాల్లోనూ లక్షల మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అయితే ఈ సంఖ్య ఏకంగా 7లక్షలు దాటడం గమనార్హం. అగ్రరాజ్యంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం ఇంకా అత్యధిక స్థాయిలోనే ఉంటున్నాయి.
ఇప్పటివరకు 7లక్షల మందికి పైగా మరణించారు. అక్కడ సగటున రోజుకు 1900 మంది కరోనాతో చనిపోతున్నారు. కరోనా మరణాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో ఇప్పటివరకు 5.97లక్షల మంది కరోనా వైరస్ బలయ్యారు. ఇక భారత్‌లోనూ 4.48లక్షల మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. గతవారం ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 8000 కరోనా మరణాలు సంభవించినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. అంటే ప్రతి నిమిషానికి ఐదుగురు కొవిడ్‌తో మృత్యువాతపడుతున్నారు.