Begin typing your search above and press return to search.

మంత్రి వ‌ర్గంలో 50 ప‌ర్సంట్ వారికే రిజ‌ర్వా? జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యూహం

By:  Tupaki Desk   |   27 March 2022 3:30 AM GMT
మంత్రి వ‌ర్గంలో 50 ప‌ర్సంట్ వారికే రిజ‌ర్వా? జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యూహం
X
ఆరు నూరైనా.. త‌ను చేయాల‌నుకున్న‌ప‌నిని చేసి తీరే దిశ‌గానే సీఎం జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. మం త్రి వ‌ర్గాన్ని పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గానే ఆయ‌న ఆలోచ‌న చేస్తున్నారు. వాస్త‌వానికి జిల్లాల బాధ్య‌త‌లు తీసుకునేందుకు కొంద‌రు మంత్రులు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని.. తాజాగా నివేదిక‌లు అందుతున్నాయి. అయి నా కూడా.. తీసుకునేవారు తీసుకుంటారు.. లేని వారు దూరంగా ఉంటారు.. అనే విధంగానే జ‌గ‌న్ దూకు డు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మంత్రి విస్త‌ర‌ణ‌పై మ‌రింత ముమ్మ‌ర క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అంటే..ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగే మంత్రివర్గ మార్పులు. సో.. దీనిని ఎన్ని క లను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో వేసే ప్ర‌తి అడుగును ఆయ‌న చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఏవిధంగా అయితే.. మంత్రి వ‌ర్గ కూర్పులోసోష‌ల్ ఇంజ‌నీరింగ్ పాటించారో.. తెలిసిందే. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు .. ఆయ‌న ప్రాధాన్యం క‌ల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఉప ముఖ్య‌మంత్రిప‌ద‌వులు కూడా ఇచ్చారు.

అదేవిధంగా మంత్రులుగా కూడా ఎలివేట్ చేశారు. స‌రే.. పూర్తిస్థాయిలో వారికి అధికారాలు ఇచ్చారా? లేదా? అనేది వేరే మాట‌. ఇక‌, అదేవిధంగా ఇప్పుడు.. మ‌రో వ్యూహంతో జ‌గ‌న్ అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు.

అదేంటంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు(ఎందుకంటే.. మ‌హిళా ఓటు బ్యాంకు పురుష ఓటు బ్యాంకు కంటే.. ఎక్కువ‌గా ఉంది. పైగా ఒక్క‌సారి మ‌హిళ‌ల్లో సెంటిమెంటు వ‌స్తే.. ఇక‌, ఎన్నిక‌లవ‌ర‌కు ఎవ‌రు ఎన్ని ప్ర‌లోభాల‌కు గురి చేసినా.. వారు జారిపోరు) జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే త‌న మంత్రి వ‌ర్గంలో 50 శాతం సీట్ల‌ను మ‌హిళ‌ల‌కే కేటాయించాల‌ని.. భావిస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌స్తుతం మ‌హిళా ఎమ్మెల్యేల సంఖ్య సుమారు 20కిపైగానే ఉంది. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా ఉన్నారు(అంటే.. మంత్రి వ‌ర్గంలో ఉన్న వారిని తీసేయ‌గా).

వీరికి మంత్రులుగా అవ‌కాశం ఇవ్వాల‌నేది జ‌గ‌న్‌ప్లాన్‌గా ఉంద‌ట‌. ఇదే జ‌రిగితే.. దేశంలో మ‌హిళా ముఖ్య‌మంత్రి ఉన్న ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రంలో కూడా జ‌ర‌గ‌ని విధంగా మ‌హిళా మంత్రులు ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రంగా సంచ‌ల‌నం సృష్టించ‌నుంది. పైగా మ‌హిళా సెంటిమెంటు కూడా అదిరిపోతుంద‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఇదే వ్యూహం అమ‌లు చేస్తే.. సుమారు 10 నుంచి 12 మంది మ‌హిళ‌ల‌కు మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.