Begin typing your search above and press return to search.
తెలంగాణకు రూ.50వేల కోట్లు.. కాకుంటే వారు ఓకే అనాలి
By: Tupaki Desk | 13 April 2020 4:15 AM GMTఎవరికి వారు.. ఎక్కడికక్కడ పనులు జరిగిపోతూ ఉంటే ఇబ్బందే లేదు. కరోనా లాంటి పిశాచి వైరస్ విరుచుకుపడితేనే తిప్పలన్ని. ఇటీవల కాలంలో ఎప్పుడూ ఎదురుకాని తీవ్రమైన పరిస్థితులు కరోనా పుణ్యమా అని ఎదురవుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రపంచంలోని పలు దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అపర కుబేరులు మొదలు అత్యంత సామాన్యులు సైతం ఇళ్లల్లోనే ఉండిపోతున్నారు. దీంతో.. పెద్ద ఎత్తున కార్యకలాపాలు ఆగిపోయాయి. ఈ కారణంగా చోటు చేసుకున్న నష్టాన్ని ఒక పట్టాన అంచనా వేయలేకపోతున్నారు ఆర్థికవేత్తలు. కరోనా కారణంగా సర్కారు నుంచి సగటు జీవి వరకూ ఆర్థికంగా ప్రభావితమయ్యారు.
సామాన్యుల సంగతి సరే.. సర్కారు పరిస్థితి సైతం ఎంతగడ్డుగా ఉంటాయన్న విషయాన్ని తన మాటలతో అర్థమయ్యేలా చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వందల కోట్లల్లో ఉంటే.. అందుకు భిన్నంగా మూడు.. నాలుగు కోట్లు కూడా వసూలు కావట్లేదన్న వైనాన్ని చెప్పి.. అందరిలోనూ తమకు జరిగే నష్టాన్ని తక్కువగా ఫీలయ్యేలా చేయటంలో సారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆదాయం రాని వేళ.. అప్పు మినహా మరో మార్గం లేని పరిస్థితి. ఇప్పటికున్న పరిస్థితి ప్రకారం భారీ ఎత్తున అప్పు చేయటం మినహా మరో మార్గం లేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున రుణాల్ని సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకున్న మార్గాల్ని వెతికిన ఆయన.. ఆర్ బీఐని తమ రుణ పరిమితిని పెంచాలన్ననిర్ణయానికి వచ్చారు. తెలంగాణ జీఎస్ డీపీలో ఎఫ్ ఆర్ బీఎం చట్టం మేరకు 3.5 శాతం మేర రుణాల్ని పెంచుకునే వీలుంది. కాకుంటే.. ఇందుకు ఆర్ బీఐతో పాటు కేంద్రం సానుకూలత చాలా అవసరం. సంపన్న రాష్ట్రంగా పేరున్న తెలంగాణలో కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితి కుదుటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు కేంద్రం సానుుకూలంగా స్పందింస్తుందన్న ఆశతో ఉన్నారు. సారు అంచనాలు నిజమైతే.. రాష్ట్రానికి రానున్న రోజుల్లో రూ.34వేల కోట్లు రుణం పేరుతో రానున్నాయి. అదే కాని జరిగితే.. తెలంగాణ ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. మరి.. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?