Begin typing your search above and press return to search.

50 వేల లీట‌ర్ల సిరా.. 5 ల‌క్ష‌ల బాటిళ్లు.. రెడీ.. ఎందుకంటే

By:  Tupaki Desk   |   12 Jan 2022 12:30 PM GMT
50 వేల లీట‌ర్ల సిరా.. 5 ల‌క్ష‌ల బాటిళ్లు.. రెడీ.. ఎందుకంటే
X
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు సుమారు 5 లక్షల సిరా బాటిళ్ల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు కర్ణాటకలోని మైసూర్కు చెందిన మైలాక్ కంపెనీ పేర్కొంది. ఇందులో ఉత్తర్ప్రదేశ్కు 4 లక్షల సీసాలు, పంజాబ్కు 62 వేలు, గోవాకు 5 వేలు, మణిపుర్కు 7 వేలు, ఉత్తరాఖండ్కు 30 వేల సిరా బాటిళ్ల డిమాండ్ ఉన్నట్లు కంపెనీ అధ్యక్షుడు ఎన్వీ ఫణీశ్ తెలిపారు. ఒక్కొక్క బాటిల్‌లో 100 నుంచి 150 గ్రాముల సిరా ఉంటుంద‌ని.. దీనికిగాను 50 వేల లీట‌ర్ల సిరా ఉత్ప‌త్తి చేసిన‌ట్టు వివ‌రించారు.

ఇప్పటికే పంజాబ్, గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అడిగినంత ఇంక్ బాటిళ్లను సరఫరా చేశామని... యూపీకి మాత్రం 2 లక్షల బాటిళ్లు అందించిట్లు ఫణీశ్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో మిగతావి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్తగా ఎన్నికల సంఘం సిరా బాటిళ్లకు బదులుగా మార్కర్ పెన్నులు వినియోగించాలని వాదన వినిపిస్తుంది.

అందుకే సుదీర్ఘ కాలం పాటు ప్రయోగాలు నిర్వహించి కొత్తగా మార్కర్ పెన్నులను కూడా తయారు చేస్తున్నట్లు ఎన్వీ ఫణీశ్ తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తామన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా... ఇందుకు అవసరమైన సిరాను ఈ సంస్థ సమకూరుస్తోంది.

ఎన్నికలు జరిగే సమయంలో ఓటర్లు ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేయకుండా గుర్తించడానికి చేతికి సిరా చుక్కను పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన నాటి నుంచి ఈ సంస్థ సిరాను ఉత్పత్తి చేస్తుంది. ఇలా సిరా ఉత్పత్తి చేసే ఏకైక సంస్థ మన దేశంలో ఇదే. ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతలను కర్ణాటక ప్రభుత్వం చూసుకుంటుంది.