Begin typing your search above and press return to search.

టెక్నాలజీ అద్భుతం.. 3 నిమిషాల ఛార్జింగ్ తో 500కి.మీ. జర్నీ

By:  Tupaki Desk   |   1 Oct 2021 3:44 AM GMT
టెక్నాలజీ అద్భుతం.. 3 నిమిషాల ఛార్జింగ్ తో 500కి.మీ. జర్నీ
X
పెట్రోల్.. డీజిల్ తో నడిచే కార్ల జమానా దాదాపుగా అయిపోయినట్లే. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు వచ్చినప్పటికీ.. ఛార్జింగ్ స్టేషన్ల సమస్యతో పాటు.. పెట్రోల్.. డీజిల్ లాంటివి ఫిల్ చేయటానికి మహా అయితే ఐదు.. పది నిమిషాలే. కానీ.. ఛార్జింగ్ మాత్రంఅరగంట.. గంట వరకు పట్టే పరిస్థితి.

ఇదే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల విప్తవానికి పెద్ద అడ్డంకిగా మారింది. దీని నుంచి బయట పడే సరికొత్త టెక్నాలజీని ఒక కంపెనీ క్రియేట్ చేసింది. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో ఇదో విప్లవంగా అభివర్ణిస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమంటే.. కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్ కే వంద కిలోమీటర్లకు పైనే ప్రయాణించేలా ఒక ఛార్జర్ ను తయారు చేశారు. అదే పావుగంట ఛార్జింగ్ చేస్తే ఏకంగా 500కి.మీ. ప్రయాణించేలా దీన్ని రూపొందించారు. ఇంతకీ ఆ ఛార్జర్ ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటన్న విషయాల్లోకి వెళితే..

స్విస్ ఇంజనీరింగ్ కంపెనీ ఏబీబీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు ఛార్జర్ ను ‘టెర్రా 360’ పేరుతో విడుదల చేసింది. దీని స్పెషాలిటీ ఏమంటే.. 360 మాడ్యులర్ ఛార్జర్ ఒకేసారి నాలుగు వాహనాల్ని ఛార్జ్ చేయగలదు. అంతేకాదు.. కేవలం పదిహేను నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే.. 500కి.మీ ప్రయాణించేలా దీన్ని రూపొందించారు.

ఎలక్ట్రిక్ కారును మూడు నిమిషాల పాటు చార్జ్ చేస్తే వంద కిలోమీటర్ల దూరం వెళ్లేలా ఈ కొత్త ఛార్జర్ ను 360కేడబ్ల్యూ అవుట్ పుట్ ఉండేలా దీన్ని రూపొందించారు. ఈ సరికొత్త ఛార్జర్ ఈ ఏడాది చివరి నాటికి యూరప్.. యూఏఈ లలో తొలుత అందుబాటులోకి రానుంది. లాటిన్ అమెరికా.. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో 2022 నాటికి తీసుకు రానున్నారు. 2010లో ఈ - మొబిలిటీ వ్యాపారంలోకి ప్రవేశించినప్పటి నుంచి 88కి పైగా మార్కెట్లలో 4.60లక్షల వాహనాలకు ఛార్జర్లను అమ్మింది.రానున్న రోజుల్లో ఈ కంపెనీ (ఏబీబీ) 3 బిలియన్ డాలర్ల విలువను సాధించిందని రాయిటర్స్ ను నివేదించండి.