Begin typing your search above and press return to search.
తాజ్ హోటల్‌లో కరోనా కలకలం.. 500 మందిలో ఆరుగురికి పాజిటివ్
By: Tupaki Desk | 12 April 2020 3:46 PM GMTదేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కేసులు రెండు వేలకు చేరువయ్యాయి. రోజుకొక చోట కరోనా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై నగరంలో వెయ్యికి పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా వస్తున్న వార్త ప్రజలను కలవరం రేపుతోంది. ఎప్పుడు వీఐపీలు ఉండే ఫైవ్ స్టార్ హోటల్‌లో కరోనా పంజా విసిరిందని సమాచారం. ఏకంగా 500 మందికి పైగా హోటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిందని పుకార్లు వచ్చాయి. ఈ వార్తతో మహారాష్ట్రలో సంచలనంగా మారింది. అయితే ఆ ప్రచారం తప్పు అని, 500మందిలో కేవలం ఆరుగురికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ హోటల్ యాజమాన్యం వెల్లడించింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు హోటల్ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.
ముంబై లబాలోని తాజ్ మహల్ ప్యాలస్, తాజ్ మహల్ టవర్స్‌లో దాదాపు 500 మందికి పైగా సిబ్బంది పని చేస్తుంటారు. అయితే వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు అధికారులు, హోటల్ యాజమాన్యం గుర్తించింది. అయితే వారంతా ఆరోగ్యంగా ఉన్నారని, వారికి అసలు కరోనా ఎలా వ్యాపించలేదని హోటల్ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం హోటల్ ఖాళీగా ఉంది. అద్దెకు ఎవరికీ ఇవ్వడం లేదు. వేడుకలు రద్దు చేశామని హోటల్ నిర్వాహకులు సమాధానం తెలిపారు. కేవలం హౌస్ కీపింగ్‌తో పాటు సెక్యూరిటీ, నిర్వహణ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉండడంతో 500మందికి పరీక్షలు చేయగా కేవలం ఆరుగురికి కరోనా పాజిటివ్ కేసులు సోకాయని తేలింది. దీంతో ఆ హోటల్ నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన వారిని ఆస్పత్రికి, మిగతా వారందరిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారందరికీ కరోనా సోకి ఉండవచ్చని వచ్చనే అనుమానంతో వారిని క్వారంటైన్‌కు పంపిచారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1,900కు చేరాయి. ఇక ముంబైలోని ధారవి మురికివాడలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 43కి చేరింది. సుమారు 7 లక్షల జనాభా ఉన్న ఈ స్లమ్ లో కరోనా వ్యాపించడంతో కలవరం మొదలైంది. ఈ సందర్భంగా ఆ ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు ముంబై మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.