Begin typing your search above and press return to search.

35 ఇండస్ట్రీ.. ఏకంగా 500 చోరీలు.. ఓ రేంజ్లో ఎంజాయ్

By:  Tupaki Desk   |   5 Oct 2021 4:09 AM GMT
35 ఇండస్ట్రీ.. ఏకంగా 500 చోరీలు.. ఓ రేంజ్లో ఎంజాయ్
X
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 35 ఏళ్లు. ఏకంగా 500 చోరీలతో భారీగా సంపదను కొల్లగొట్టే ఈ దొంగ కథ ఇది. చోరీ చేసిన సొత్తుతో ఎంజాయ్ చేయటానికి అలవాటు పడిన ఇతగాడిని తాజాగా ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సారి విచారణ కాస్త లోతుగా సాగటంతో అతడికి సంబంధించిన కొత్త విషయాలు బయటకు వచ్చాయి. 35 ఏళ్లుగా వరుస చోరీలకు పాల్పడే ఇతడ్ని క్రౌబర్ మ్యాన్ గా పేరుంది. దోపిడీలు చేయటం.. పోలీసులు పట్టుకోవటం.. జైలుకు వెళ్లి వచ్చినంతనే మళ్లీ చోరీలు చేయటం.. దొంగలించిన సొత్తుతో ఎంజాయ్ చేయటం ఇతడికి అలవాటు.

ఒడిశా పోలీసులకు సవాలుగా మారిన ఈ దొంగపేరు హేమంత్ దాస్. 1986 నుంచి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇప్పటివరకు 500 ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లుగా తాజాగా గుర్తించారు. ఇప్పటివరకు అతను చోరీ చేసిన మొత్తం రూ.4-5 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది.

దొంగలించిన సొత్తును తీసుకొని కశ్మీర్.. గ్యాంగ్ టక్.. సిమ్లాకు వెళ్లిపోయి అక్కడే ఉండి ఎంజాయ్ చేసేవాడు. భువనేశ్వర్ లో కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక వివాదం కారణంగా జైలుకు వెళ్లాడు.

ఆ క్రమంలో జైల్లోని ఒక దొంగతో పరిచయం ఏర్పడింది. అతడి వద్ద నుంచి మెలుకువలు నేర్చుకున్న హేమంత్ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రొఫెషనల్ దొంగగా మారాడు.

పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు పంపినా.. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాల మీద ఫోకస్ పెట్టటం రివాజుగా మారింది. తాజాగా అరెస్టు అయిన అతగాడిని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇతగాడి చోరీల్లో ప్రత్యేకత ఏమంటే.. నగదును దోచుకోవటానికే ఎక్కువ ఆసక్తి చూపించే ఇతడు.. చోరీ చేసిన వెంటనే ఆ సొత్తుతో ఎంజాయ్ చేయాలన్న ఆలోచన చేస్తాడని చెబుతారు. ఇప్పటివరకు దోచిన సొత్తుతో ఎక్కువగా ఎంజాయ్ చేశారని పోలీసులు చెబుతున్నారు.