Begin typing your search above and press return to search.

ఇండియాలో పది వేల నోట్లు ఉండేవి తెలుసా?

By:  Tupaki Desk   |   9 Nov 2016 2:37 AM GMT
ఇండియాలో పది వేల నోట్లు ఉండేవి తెలుసా?
X
పెద్ద నో్ట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం మంగళవారం రాత్రి కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. నల్లధనం గుట్టలుగుట్టలుగా పోగేసుకున్నవారికి దాన్నేం చేయాలో తెలియక ఆందోళనతో నిద్ర పట్టకపోగా.... తమ వద్ద ఉన్న నోట్లు చెల్లకపోతే ఏంచేయాలంటూ మధ్య తరగతి, రెండు రోజుల పాటు తమకు రోజువారీ కూలి డబ్బు దొరకడం కష్టమని తెలిసి నిరుపేద కూలీలు నిద్రపోలేదు. ఇదంతా ఎలా ఉన్నా ఇలా నోట్లను రద్దు చేయడమన్నది మన దేశంలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా.. లేదంటే మోడీయే ఫస్టు టైమా అన్నదీ ఆసక్తికరమే.

- ఇండియాలో ఇంతకుముందు రెండు సార్లు ఇలా కొన్ని నోట్లను రద్దు చేశారు.

- 1938 నుంచి మనదేశంలో రూ.10 వేల నోటు ఉండేది. దాన్ని 1946లో రద్దు చేశారు.

- మళ్లీ 1954లో రూ.వెయ్యి, 5 వేలు, 10 వేల నోట్లను ప్రవేశపెట్టారు.

- 1978లో వాటిని రద్దు చేశారు.

- 1970ల్లో నల్లధనంపై ఏర్పాటైన కమిటీ పెద్ద నోట్లను రద్దు చేయాలని సూచించింది. అప్పటి ప్రభుత్వం ఆ సూచన పట్టించుకోకపోయినా అప్పటి నల్లకుబేరులు మాత్రం ఆ నోట్లకు ఎప్పటికైనా దెబ్బ పడొచ్చన్న భయంతో జాగ్రత్తగా వదిలించుకున్నారు.

- 1978లో ఏర్పాటైన జనతా ప్రభుత్వం వెయ్యి, 5 వేలు, 10 వేల నోట్లను రద్దు చేసింది.

- అయితే... ద్రవ్యోల్బణం కారణంగా 100 నోటు విలువ తగ్గడంతో 1987లో 500.. 2000 సంవత్సరంలో వెయ్యి నోట్లను ప్రవేశపెట్టారు.

- తాజాగా ఆ రెండింటిని రద్దు చేశారు.