Begin typing your search above and press return to search.
ఐపీఎల్-2022 బిడ్డింగ్ ద్వారా బీసీసీఐకి 5000 కోట్లు!
By: Tupaki Desk | 2 Sep 2021 2:30 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్‌కు కొత్త రంగులు అద్దడానికి బీసీసీఐ సిద్ధమైంది. 2022 ఎడిషన్‌లో రెండు కొత్త జట్లు అదనంగా బీసీసీఐలో చేరనున్నాయి. మొత్తం టీమ్‌లను 10కి విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు జట్లను కొనాలనే వారి కోసం బీసీసీఐ బిడ్డింగ్ నిర్వహించనుంది. ఈ జట్లకు ప్రాథమిక ధరను రూ. 2000 కోట్లుగా నిర్ణయించింది.. అందువల్ల బోర్డుకు ఈ బిడ్డింగ్‌ల ద్వారా 5000 కోట్ల ఆదాయం పక్కగా వస్తుంది.
"ఏ కంపెనీ అయినా బిడ్డింగ్ లో పాల్గొనాలనుకుంటే రూ .75 కోట్లు ప్రాథమిక సొమ్ము చెల్లించి బిడ్ పత్రాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇంతకుముందు ఉన్నతాధికారులు రెండు కొత్త టీమ్‌ల కోసం ప్రాథమిక ధరను రూ. 1700 కోట్ల రూపాయల వద్ద ఉంచాలని ఆలోచిస్తున్నారు, కానీ తర్వాత రూ. 2000 కోట్లకు బేస్ ధరను పెంచాలని నిర్ణయించారు" అని బిసిసిఐ సీనియర్ అధికారి పిటిఐకి తెలిపారు.
"బిసిసిఐ 5000 కోట్ల ఆదాయం లేదా అంతకంటే ఎక్కువ ఆశిస్తోంది. వచ్చే సీజన్‌లో 74 ఐపిఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి.. ఇది ప్రతిఒక్కరికీ ఆహ్లాదం పంచే విషయం. క్రికెట్ కు మరింతగా ఊపు వస్తుంది.. ' అని బీసీసీఐ భావిస్తోంది.
రూ. కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలను మాత్రమే బీసీసీఐ ఈ బిడ్డింగ్ కోసం అనుమతిస్తోంది. వేలం 3000 కోట్లు వరకూ చేరుతుందని అంటున్నారు . రెండు కొత్త ఫ్రాంచైజీల కోసం అహ్మదాబాద్, పూణే, లక్నో మధ్య పోటీ ఉంది.