Begin typing your search above and press return to search.
ఎన్నికల మాయ..యూపీకి 5వేల కోట్ల కొత్త నోట్లు
By: Tupaki Desk | 25 Dec 2016 10:09 AM GMTరాజకీయాలు పరిపాలనను ఎలా ప్రభావితం చేస్తాయనేందుకు ఇదో నిదర్శనం. దేశప్రజలు నగదు కొరత ఎదుర్కొంటుండగా యూపీకి భారీగా కొత్తనోట్లు తరలివచ్చాయని స్థానిక దినపత్రికల్లో వార్తలొచ్చాయి. ఆర్బీఐ ఒక ప్రత్యేక విమానంలో యూపీకి రూ.5000 కోట్ల విలువైన నోట్లు పంపిందని ఒక ప్రముఖ వార్తాసంస్థ కథనం ప్రచురించింది. ఇదంతా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల ప్రభావమేనని నిఫుణులు చెప్తున్నారు. ఈ వార్త రాజకీయవర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ బ్యాంకులు తమ ఖాతాదారులు రూ.4,500 నగదు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతినిస్తున్నాయి. నోట్ల రద్దుతో నెలకొన్న తీవ్ర నగదు కొరత ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీ విజయా వకాశాలపై పడకుండా బీజేపీ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తున్నది. తూర్పు యూపీలోని బాన్స్‌గావ్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ కమలేశ్ పాశ్వాన్ తన మద్దతుదారులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా నగదు కొరత తీవ్రత తగ్గిందని, దీనికి కారణం కొత్తనోట్లు భారీగా రావడమేనన్నారు. రెండు రోజుల్లో గోరఖ్ పూర్ జిల్లాకు రూ.1,650 కోట్ల నగదు వచ్చిందని బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. కొన్ని బ్యాంకులు రూ.50 వేల వరకు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతిస్తున్నాయని అనధికారిక సమాచారం.
భారీగా నగదు తమ రాష్ట్రానికి వచ్చిందని బీజేపీ శ్రేణులు చెప్తున్నట్లు స్థానిక దిన పత్రికలు కొద్దిరోజులుగా వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత పరిస్థితులపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ద్వారా సమాచారం సేకరించారని ఫైజాబాద్ ఎంపీ లల్లూసింగ్ చెప్పారు. భారీగా నగదు పంపి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరామన్నారు. "మేం అమిత్ షాను ఆర్బీఐ ద్వారా త్వరితగతిన భారీగా నగదు పంపి నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరాం. దీనికి ఆయన స్పందిస్తూ అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తామన్నారు"అని లల్లూ సింగ్ తెలిపారు. ఇదిలాఉండగా.. ఈ నెల 17న యూపీకి ఒక ప్రత్యేక విమానంలో రూ.5000 కోట్ల నగదు తరలించినట్లు ఆర్బీఐ అధికారి ఒకరు చెప్పినట్లు ఐఏఎన్ ఎస్ వార్తాసంస్థ ఓ వార్తాకథనం వెలువరించింది. దీనిపై ఒక ఆంగ్ల టీవీ చానల్ వివరణ కోరగా తాము రాష్ట్రాల వారీగా ఎంత నగదు పంపామన్నదని బహిర్గతం చేయలేమని ఆర్బీఐ అధికార ప్రతినిధి పేర్కొనడం గమనార్హం.
అయితే భారీగా నగదు రాష్ట్రానికి వచ్చిందన్న అంశంపై క్షేత్రస్థాయి లో మిశ్రమ స్పందన కనిపిస్తున్నది. గోరఖ్‌పూర్ జిల్లాలోని కౌడి యా గ్రామంలోని ఎస్బీఐ శాఖ వద్ద క్యూలైన్ లో నిలుచుకున్న ఓ మహిళను ప్రశ్నించగా తాము తెల్లవారుజామున నాలుగు గంటలకు వస్తే బ్యాంకు లోపలికి వెళ్లే సరికి మధ్యాహ్నం అవుతున్నదని ఆవేదన వ్యక్తంచేసింది. బ్యాంకు సిబ్బంది తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని మహిళలు తెలిపారు. బ్యాంకు మేనేజర్ తనను మెడబట్టుకుని గెంటేశాడని ఓ మహిళ వాపోయింది. రెండు రోజులుగా పరిస్థితి మెరుగైందని చెప్తు న్నా.. పూర్తిగా నగదు అందుకోలేకపోతున్నామన్నారు. ఎన్నికల లబ్ధి కోసం కేంద్రం పక్షపాతం ప్రదర్శించే అవకాశం లేదని, అన్ని ప్రాంతాల మాదిరిగానే గోరఖ్ పూర్ కు కొత్త నోట్లు వస్తాయని మరికొందరు స్థానిక బీజేపీ నేతలు చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/