Begin typing your search above and press return to search.

కరోనాకి మందు కనిపెట్టిన చైనా..5 వేల మందితో ట్రయల్స్‌!

By:  Tupaki Desk   |   26 March 2020 8:51 AM GMT
కరోనాకి మందు కనిపెట్టిన చైనా..5 వేల మందితో ట్రయల్స్‌!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితులు రోజు రోజుకూ పెరుగుతుండటంతో దీనికి ఎప్పుడు - ఎలా అడ్డుకట్టపడుతుందో తెలియక వందల కోట్ల మంది ఆందోళన చెందుతున్నారు. మహమ్మారికి ఇప్పటి వరకూ ఎలాంటి చికిత్స - వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు - సంస్థలు ముమ్మర పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దీంతో, వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35 ఫార్మ కంపెనీలు - సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి.

ఇకపోతే ,ఈ మహమ్మారికి చైనా వ్యాక్సిన్ కనిపెట్టింది అని అక్కడ జరుగుతున్న కొన్ని ఔషధ పరీక్షలను చూస్తే అర్థమౌతుంది. శాస్త్రవేత్తలు పలు ప్రయోగాల అనంతరం కనిపెట్టిన ఓ వ్యాక్సిన్‌ ను పరీక్షించేందుకు చైనా సిద్ధమవుతున్నారు. ఈ వ్యాక్సినేషన్‌ ను పలు దశల్లో చేపట్టనుండగా - మొదటి దశకోసం ఏకంగా 5 వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా రిజిస్టర్‌ చేసుకున్నారని బీజింగ్‌ న్యూస్‌ తెలిపింది. దీన్ని ఓపెన్‌ అండ్‌ డోస్‌ ఎస్కలేషన్‌ దశ–1గా పిలుస్తున్నారు.

కరోనని ఎదుర్కొనేందుకు చైనా శాస్త్రవేత్తలు అయిదు ప్రత్యేక వ్యాక్సిన్‌ మార్గాల ద్వారా ప్రయత్నాలు చేయనున్నారు. అందులో ఇన్‌ యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్లు, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ సబ్‌ యూనిట్‌ వ్యాక్సిన్లు - అడెనో వైరస్‌ వెక్టార్‌ వ్యాక్సిన్లు, న్యూక్లియిక్‌ యాసిడ్‌ వాక్సిన్ - వెక్టార్లుగా అటెన్యెయేటెడ్‌ ఇన్‌ఫ్లూయంజా వైరస్‌ వ్యాక్సిన్లును ఉపయోగించనున్నారు. ఏప్రిల్‌ కల్లా ప్రీ–క్లినికల్‌ దశలను పూర్తి చేసుకునే అవకాశం ఉందని పరిశోధనలో పాల్గొన్న నిపుణుడు వాంగ్‌ జుంఝి తెలిపారు. వ్యాక్సిన్‌ పరిశోధనల్లో ఇతర దేశాల కంటే తామేమీ వెనుకబడలేదని - శాస్త్రీయమైన - కచ్చితమైన మార్గాల్లో పరిశోధనలు సాగుతున్నాయని తెలిపారు.