Begin typing your search above and press return to search.

దేశంలో కొత్తగా 50,129 కేసులు

By:  Tupaki Desk   |   25 Oct 2020 9:30 AM GMT
దేశంలో కొత్తగా 50,129 కేసులు
X
చలికాలం సమీపిస్తుండడంతో దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గడం ఊరటనిస్తోంది. భారత్ లో భారీగా నమోదవుతూ వస్తున్న కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఊరటగా చెప్పవచ్చు.

కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం.. భారత్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50129 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కేసు సంఖ్య 78,64,811కి చేరింది. ఇందులో 70,78,123 మంది ఇప్పటికీ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 6,68,154 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

రోజువారీ రికవరీ కేసులు భారీ సంఖ్యలో ఉండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతోంది. అదే విధంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది.

గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 578 మంది మరణించారు. దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,18,534కి చేరింది.

*తెలంగాణలో కొత్తగా 1,273 కరోనా కేసులు

తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,273కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,30,274 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,303గా ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,09,034 మంది కోలుకోగా ప్రస్తుతం 19,937 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 16,809 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.