Begin typing your search above and press return to search.
వీళ్లే మన అసెంబ్లీ రౌడీలు
By: Tupaki Desk | 31 Aug 2017 6:56 AM GMTఒక గుర్మీత్ రాం రహీం సింగ్ .. ఒక నిత్యానంద స్వామి .. బాబాల ముసుగులో మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు అడపా దడపా వెలుగులోకి వస్తున్నారు. కానీ ప్రజా సేవ చేస్తామంటూ రాజకీయాల్లోకి వస్తున్న నేతలు ఎంత మందికి సచ్చరిత్ర ఉందని ఆరా తీస్తే ఆశ్చర్యకరమయిన - ఆందోళన చెందాల్సిన అంశాలు వెలుగు చూశాయి.
భారతదేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ - ఉభయ పార్లమెంటు సభలలో ఉన్న మొత్తం ప్రజా ప్రతినిధులలో 1,581 మంది నేరచరిత్రను కలిగివున్నవారేనని తేలింది. ఈ అఘాయిత్యాలలో దేశభక్తి అంటూ నిత్యం నీతిసూత్రాలు వల్లించే బీజేపీ పార్టీ ప్రజా ప్రతినిధులు అత్యధికంగా 14 మంది మహిళల మీద నేరాలకు పాల్పడిన వారు ఉండడం విశేషం.
ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధుల అఫిడవిట్లు పరిశీలించిన ఏడీఆర్ అనాలిసిస్ అనే సంస్థ దేశంలోని 51 మంది ప్రజా ప్రతినిధులు మహిళల మీద నేరాలు చేసినట్లు వెల్లడించింది. దేశంలో మొత్తం రాజ్యసభ - లోక్ సభ కలుపుకుని 776 మంది ఎంపీలుండగా - 774 మంది అఫిడవిట్లను - 4,120 మంది ఎమ్మెల్యేలు ఉండగా 4,078 మంది అఫిడవిట్లను పరిశీలించారు. ఇందులో ముగ్గురు ఎంపీలు - 48 మంది ఎంఎల్ ఏలు మహిళల మీద అఘాయిత్యానికి పాల్పడిన వారు ఉన్నారు. ఈ కేసులు అన్నీ విచారణ దశలో ఉన్నాయి. ఇక భూకబ్జాలు - దాడులకు పాల్పడిన వారి సంఖ్య భారీగా ఉన్నట్లు తేలింది. నేర చరితులు రాజకీయాల్లో లేని భారతదేశాన్ని ఇప్పట్లో చూడడం కష్టమే కావచ్చు.