Begin typing your search above and press return to search.
సీఏఏకు మద్దతుగా 52 లక్షల మిస్‌డ్ కాల్స్ !
By: Tupaki Desk | 7 Jan 2020 8:10 AM GMTగత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తం గా పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రం ఈ చట్టానికి వ్యతిరేకం అని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సీఏఏకు దేశవ్యాప్త మద్దతును సమీకరించాలనే ఉద్దేశం తో బీజేపీ శుక్రవారం మిస్‌డ్ కాల్ పద్దతిని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం 8866288662 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేసింది. ఈ టోల్ ఫ్రీ నంబర్ కు ప్రజల నుంచి భారీగా మద్ధతు లభిస్తుంది.
ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పౌరసత్వ చట్టానికి మద్దతును ప్రకటిస్తూ తమకు 52 లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తాము ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 68 లక్షల కాల్స్ వచ్చాయని అమిత్ షా తెలిపారు. వాటన్నింటిలో 52 లక్షల 72 వేల కాల్స్ వెరిఫైడ్ కాల్స్‌గా తేలాయని ఆయన చెప్పారు. డిసెంబర్‌లో ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటినుంచి దేశవ్యాప్తంగా CAAకి వ్యతిరేకం గా నిరసనలు జరుగుతున్నాయి.
ఇక ప్రజలకు CAA పట్ల ఉన్న అనుమానాలన్నింటిని తొలగించేందుకు బీజేపీ ఆదివారం నుంచి డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు.ఇక అమిత్ షా సోమవారం ఢిల్లీలోని లజపత్ నగర్‌లో సందర్శించారు. సవరించిన పౌరసత్వ చట్టం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలతో మాట్లాడారు. వారిలో ఈ చట్టం పట్ల అవగాహాన పెంచేందుకు ఆయన ప్రయత్నించారు. అంతేకాకుండా, ఆయనే స్వయంగా ఈ అంశానికి సంబంధించిన కరపత్రాలను కూడా పంపిణీ చేశారు. ఏదేమైనా కూడా ఈ చట్టం అమలుపై వెనక్కి తగ్గేది లేదు అని బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమౌతుంది.