Begin typing your search above and press return to search.

ఎమ్మార్పీకే వాట‌ర్ అమ్మేలా చూస్తార‌ట‌

By:  Tupaki Desk   |   25 March 2017 6:17 AM GMT
ఎమ్మార్పీకే వాట‌ర్ అమ్మేలా చూస్తార‌ట‌
X
నిర్దేశిత ధ‌ర‌కే వాట‌ర్ బాటిల్ కొనుక్కోవ‌డం అనేది దాదాపుగా ఎక్క‌డా సాధ్య‌ప‌డ‌టం లేదు. అయితే దీన్ని నివారించేందుకు, ఎమ్మార్పీకే వాట‌ర్ బాటిల్లు అమ్మేలా చేసేందుకు కొద్దికాలం క్రితం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆదేశాలు జారీ చేశారు. అయితే అవి బుట్ట దాఖ‌లు అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల్లో స‌భ్యులు ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీశారు. దీనిపై రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో పాశ్వాన్ స‌మాధాన‌మిచ్చారు. సీసాల్లో నింపిన తాగునీటితో పాటు ఇతర వస్తువులను గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌ పి) కంటే ఎక్కువ ధరకు అమ్ముతుండటంపై దాదాపు 5,700 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ విష‌యంలో త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాలకు రాసిన లేఖలకు ఎటువంటి సమాధానం రాలేదని తెలిపారు.

ఏ వస్తువునైనా ఎంఆర్‌ పి కంటే అధిక ధరకు అమ్మడం ప్రజలను మోసగించడమే అవుతుందని పాశ్వాన్ పేర్కొంటూ, ఈ అంశంపై ఇటీవల అధికారుతో సమావేశాన్ని నిర్వహించి ఈ సమస్యలపై దృష్టి సారించాల్సిందిగా సూచించానన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇలాంటి ఫిర్యాదుల విష‌యంలో సీరియస్‌ గా ఉంద‌న్నారు. ఇటువంటి అక్రమాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు త్వరలో సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఈ చట్టానికి సంబంధించిన బిల్లును తొలుత మంత్రివర్గ పరిశీలనకు పంపి, ఆ తర్వాత పార్లమెంట్‌ లో ప్రవేశపెడతామని చెప్పారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)పై ఫిర్యాదు వచ్చిందని, అయితే బిసిసిఐ సకాలంలో చర్యలు చేపట్టి వాటిని నిరోధించిందని పాశ్వాన్ చెప్పారు.

ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శుక్లా జోక్యం చేసుకొని దీంతో పది రూపాయల విలువచేసే వాటర్ బాటిల్‌ను విమానయాన సంస్థలు 50 రూపాయలకు అమ్ముతున్నాయని పేర్కొంటూ, పౌర విమానయాన శాఖను వివాదంలోకి లాగారు. ఇటువంటి అక్రమాలను నిరోధించేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలకు ఏవైనా మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోందా? అని శుక్లా ప్రశ్నించగా, ఇందుకు సంబంధించి గతంలో పంపిన ముసాయిదా బిల్లుకు పార్లమెంటరీ స్థారుూ సంఘం 80కి పైగా సవరణలను సూచించిందని, దీంతో ఈ సవరణలను చేయడం కంటే కొత్త బిల్లును రూపొందించడం ఉత్తమమని ప్రభుత్వం నిర్ణయించిందని పాశ్వాన్ వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/