Begin typing your search above and press return to search.
ఇండియన్ ఆర్మీలో కశ్మీర్ యువత
By: Tupaki Desk | 31 Aug 2019 11:20 AM GMTఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క.. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమైన క్షణం ఇదీ.. కశ్మీర్ ను భారత్ లాగేసుకుందని పాకిస్తాన్ ఆరోపిస్తున్న సమయం ఇదీ.. కశ్మీర్ ప్రజలు - యువత రగిలిపోతున్నారని పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. ఇన్నాళ్లు ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం.. కశ్మీర్ ప్రత్యేక హక్కులను తొలగించడం చేశాక అసలు కశ్మీర్ యువత రియాక్షన్ ఏంటనేది ఆసక్తిగా మారింది. అయితే తాజా చర్య మాత్రం కశ్మీర్ యువతకు భారత సైన్యంపై ఎంత ఆసక్తి ఉందో తేటతెల్లమైంది..
1947లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక సర్వస్వతంత్రంగా ఉన్న కశ్మీర్ పై పాకిస్తాన్ దాడి చేసింది. పాకిస్తాన్ దాడులను కాచుకునేందుకు 1947లోనే జమ్మూకశ్మీర్ యువకులతో ‘జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ ఫాంట్రీని’ అనే సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత భారత్ లో విలీనం అయ్యాక ఆర్టికల్ 370 వల్ల కశ్మీర్ యువతను భారత సైన్యంలో చేర్చుకోవడానికి నిబంధనలు కొన్ని అడ్డుగా ఉండేవి.
అయితే తాజాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత అనూహ్యం కశ్మీర్ యువత భారత సైన్యంలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూకశ్మీర్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన 575మంది యువకులు ఈరోజు భారత ఆర్మీలో చేరారు. జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ ఫాంట్రీ లోకి వీరిని తీసుకున్నారు. శ్రీనగర్ లో జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ లో వీరు విధుల్లో చేరారు. భారత దేశానికి సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. మాతృదేశం కోసం ప్రాణాలను అర్పించేందుకు రెడీ అని వారు అనడం విశేషం. జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ సైనికులు పాకిస్తాన్ చొరబాట్లను అడ్డుకునేందుకు కాపాలా కాస్తుంటారు.