Begin typing your search above and press return to search.
హానీ ట్రాప్ : అడ్డంగా బుక్, ఏకంగా రూ.59 లక్షలు హుష్‌కాకీ
By: Tupaki Desk | 29 July 2021 5:27 AM GMTహానీట్రాప్..ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిసస్తోన్న పదం. మొదటగా మాటలు కలిపి , ఆ తర్వాత నమ్మకం ఏర్పరచుకొని ట్రాప్ చేసి లక్షలు కాజేస్తుంటారు. ఈ తరహా ఘటనలు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి కేరళలో వెలుగులోకి వచ్చింది. ప్రవాస వ్యాపార వేత్త నుంచి ఒక మహిళ హానీట్రాప్ చేసి రూ.59 లక్షలు కాజేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మహిళతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
ఈ హనీ ట్రాప్ గురించి పూర్తి వివరాలు చూస్తే .. కన్నూరులోని కూతుపరంబాకు చెందిన సింధు, పెరుమన్నకు చెందిన కే.షానూబ్ ఫరూక్ కాలేజీకి చెందిన ఎం.శరత్ కుమార్ లు ప్రవాస వ్యాపార వేత్తనుంచి డబ్బు, బంగారం, కారు దొంగతనం చేసిన కేసులో నాడ్కావు పోలీసులు అరెస్ట్ చేశారు. సింధుకు సోషల్ మీడియా ద్వారా గల్ఫ్ లో ఉన్న ప్రవాస వ్యాపారవేత్త పరిచయం అయ్యాడు. తాను ఇండియా లో హోటల్ వ్యాపారం, బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నానని అతనికి పరిచయం చేసుకుంది. తన వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తున్నాయని తన వ్యాపారాన్ని విస్తరిస్తానని ఆమె అతనితో చెప్పింది. సింధు మాటలు నమ్మిన వ్యాపార వేత్త ఆమెకు గల్ఫ్ నుంచి డబ్బులు పంపించటం మొదలెట్టాడు. ఆ వ్యాపార వేత్తనుంచి పలు దఫాలుగా వ్యాపార విస్తరణకోసం సింధు రూ. 59 లక్షల రూపాయలు వసూలు చేసింది.
తాను ఇండియా వచ్చినప్పుడు బిజినెస్ అగ్రిమెంట్ మీద సంతకం పెడతానని ఆ వ్యాపారవేత్త చెప్పాడు. వ్యాపార వేత్తనుంచి డబ్బు తీసుకున్న సింధు అతనికి వ్యాపారంలో లాభాలు వచ్చాయని చెప్పి రూ. 50 వేలు రూపాయలు తిరిగి పంపించింది. అది నిజమని నమ్మిన వ్యాపారవేత్త వ్యాపార విస్తరణ కోసం మరికొంత డబ్బు పంపించాడు. ఈలోగా వ్యాపారవేత్త ఇండియా వచ్చాడు. సింధును కలవటానికి ప్రయత్నించగా ఆమె అతడ్ని కలవకుండా తప్పించుకు తిరగసాగింది. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సింధును ఫోన్ లోనే తన డబ్బులు అయినా తిరిగి ఇవ్వమని, లేదంటే వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వమని గట్టిగా కోరాడు. దీనితో ఇంక వ్యాపార వేత్తనుంచి తప్పించుకోవటం సాధ్యం కాదనుకున్నసింధు కారపరంబిల్‌లో ఉన్న తన ఫ్లాట్ కు వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం రమ్మని పిలిచింది. అక్కడకు వచ్చిన వ్యాపారవేత్తను సింధు సాదరంగా ఆహ్వానించింది. అతడికి మర్యాదలు చేసింది. అతడిని తన పడక గదిలోకి తీసుకువెళ్లి అతనితో సన్నిహితంగా ఉండసాగింది.
అప్పటికే ప్లాట్ లో ఉన్న ఆమె మనుషులు అదంతా రహస్యంగా వీడియో తీశారు. సింధుపై అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సింధును డబ్బు విషయమై గట్టిగా నిలదీసేసరికి అక్కడే ఉన్న ఆమె మనుషులు బయటకు వచ్చి వ్యాపారవేత్తను కొట్టి నగ్నంగా చేశారు.అతడిని బెదిరించి సింధుతో కలిపి నగ్నంగా మరికొన్ని ఫోటోలు, వీడియోలు తీశారు. అతడి మెడలో ఉన్న బంగారు గొలుసు, అతని వద్ద ఉన్ననగదు దోచుకుని పంపించి వేశారు. ఈ విషయం ఎక్కడైనా చెప్పి, పోలీసు కంప్లైంట్ ఇస్తే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించారు.
దీంతో భయపడిన వ్యాపార వేత్త అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆతర్వాత కూడా వ్యాపారవేత్తను వీడియోలు చూపించి బెదిరించటం ప్రారంభించింది సింధు. ఇంక వీరి బెదరింపులు తట్టుకోలేని వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న నాడ్కావు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారపరంబిల్ లో నివాసం ఉంటున్న సింధు ప్లాట్ పై దాడి చేసిన పోలీసులు సింధుతో సహా మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గతంలో నేరచరిత్ర కలిగిన వారుగా పోలీసులు చెప్పారు. సింధుకు కేరళలో ఎటువంటి వ్యాపారాలు లేవని, లేని వ్యాపారం గురించి చెప్పి వ్యాపార వేత్త వద్ద డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వివరించారు.