Begin typing your search above and press return to search.
అతి త్వరలో ఇండియాకు 5జీ ... ఎప్పటినుంచంటే ?
By: Tupaki Desk | 12 March 2021 1:30 AM GMTభారతదేశంలో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి ఎప్పుడొస్తుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఎందుకు అంటే 5జీ నెట్ వర్క్ కు కావల్సిన మౌళిక సదుపాయాల కల్పన అడ్డంకిగా మారిపోయింది. టెక్నాలజీకి కీలకమైన ఫైబర్ ఆధారిత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇంకా సిద్ధం కాలేదు. ఈ నేపధ్యంలో 5జీ ప్రారంభించినా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాల్సి వస్తుందని టెలికం పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. 5జీ అందుబాటులో తెచ్చేందుకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనపై ఇండియా సత్వరం నిర్ణయం తీసుకోవాలని అంటున్నాయి. లేకుంటే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాల్ని అందిపుచ్చుకోలేమని నోకియా ఇండియా తెలిపింది.
5జీ నెట్‌వర్క్‌ను కేవలం ఆపరేటర్ల వ్యాపారంగా భావించకూడదని..దేశానికి ప్రపంచానికి ఆర్ధికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇది చాలా అవసరమని చెబుతోంది. ఇండియాలో 5జీ సిద్దం చేస్తున్నామని, టెలీకం కంపెనీలు మాత్రం పరిస్థితులన్నీ అనుకూలిస్తే 3 నెలల్లోనే వినియోగంలో తీసుకురావచ్చని అంటున్నాయి. కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడమనేది ఇండియాలో వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమని టెలీకం ఎక్స్ పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్ భావిస్తోంది. రుణాలపై వడ్డీ రేటు ఎక్కువగా ఉండటమే కారణమని అంటున్నాయి.
చైనాలో చూస్తే కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేసేందుకు స్థానిక కంపెనీలకు దాదాపు 200 బిలియన్ డాలర్ల దాకా ప్రభుత్వమే సమకూరుస్తోందని ఆయన వివరించారు. మరోవైపు, భారత్ టెక్నాలజీలను పూర్తి స్థాయిలో రూపొందించే పరిస్థితి లేదని, మిగతా వారి నుంచి కూడా మద్దతు తీసుకోవాల్సిన ఉంటోందని టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సీఈవో అరవింద్ బాలి తెలిపారు.