Begin typing your search above and press return to search.
డేటా అయినా కొనండి - లేదా మెట్రో ఎక్కండి!!
By: Tupaki Desk | 10 Dec 2019 12:08 PM GMTఇవాల్టి రోజున స్మార్ట్ ఫోన్ చేతిలో లేనోళ్లు ఉండరు. ఫోన్ ఉన్నాక అందులో వాట్సాప్.. సోషల్ మీడియా అప్డేట్స్ చూసుకోవటం కామన్. అయితే.. ఇంటర్నెట్ లేకున్నా.. మొబైల్ డేలా అయిపోయినా వీడియోలు చూసుకునే వీల్లేదు. ఈ కొరతను తీరుస్తూ హైదరాబాద్ మెట్రో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. షుగర్ బాక్స్ పేరుతో తీసుకొచ్చిన సరికొత్త సాంకేతికత వినూత్నంగా ఉందని చెప్పాలి.
తొలుత పది మెట్రో స్టేషన్లలో షుగర్ బాక్స్ మెట్రో లోకల్ వైఫై సేవల్ని ప్రారంభించినట్లు చెబుతున్నారు. దీని ప్రకారం షుగర్ బాక్స్ యాప్ కానీ మొబైల్ ఫోన్లో ఉండే చాలు.. మూడు నిమిషాల్లో కోరుకున్న సినిమాను డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉంటుంది. దాంతో వీడియోల్ని చూసుకునే వీలుందన్నారు.
తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన జీ5 సేవల్ని అరవై రోజుల పాటు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామన్నారు. ప్రతిరోజు మెట్రోలో ప్రయాణించే వారికి తమ సాంకేతికత ఎంతో ఉపయోగంగా ఉంటుందన్న ఆయన.. రానున్న రోజుల్లో గేమింగ్.. ఫుడ్.. ఈ-కామర్స్.. ఈ-లెర్నింగ్ లాంటి వాటిని కూడా అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మరి.. దీనికి ఆదరణ ఎంత ఉంటుందో చూడాలి.