Begin typing your search above and press return to search.
డ్రాగన్ దేశంల 5జీ సేవల లెక్కలు బయటకొచ్చేశాయ్
By: Tupaki Desk | 1 Nov 2019 4:37 AM GMT4జీ ఇప్పుడిప్పుడే సాధారణ ప్రజలకు సైతం వంటపడుతున్న వేళ.. దానమ్మ మొగుడుగా చెప్పే 5జీ సేవలు కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలయ్యాయి. పొరుగున ఉన్న డ్రాగన్ దేశంలో ఈ రోజు నుంచి 5జీ సేవల్ని దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. చైనాలోని ప్రముఖ టెలికాం ఆపరేషర్లు ముగ్గురు 5జీ సేవల్ని చైనాలోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేశారు.
చైనాలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన చైనా మొబైల్ అయితే బీజింగ్.. షాంఘై.. షెంజాన్ తదితర యాభై నగరాల్లో 5జీ సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. దాని ప్రత్యర్థి కంపెనీలైన చైనా టెలికం.. చైనా యూనికామ్ లు కూడా 5జీ బాట పట్టాయి. 4జీతో పోలిస్తే.. వంద రెట్లు వేగంగా పని చేసే 5జీ పుణ్యమా అని మొబైల్ సేవలతో పాటు.. మరిన్ని టెలికాం సేవల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
డేటా డౌన్ లోడ్ విషయంలో 5జీ స్పీడ్ ఎంతంటే.. ఒక సినిమాను డౌన్ లోడ్ చేసుకోవటానికి కొన్ని సెకన్లలోనే పూర్తి చేసే పరిస్థితి. అంతేకాదు.. మొబైల్ యాప్స్ ను సైతం వర్చువల్ రియాలిటీలో ఉపయోగించుకునే వీలుతో పాటు.. నెట్ ఆధారిత పనుల విషయంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. వేగం సంగతి బాగానే ఉంది.. నెలవారీగా అయ్యే బిల్లు సంగతేమంటారా? అక్కడికే వస్తున్నాం. చైనాలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్ చైనా మొబైల్ వారు తాము అందించే 5జీ సేవల్ని వినియోగించుకోవాలంటే నెలకు దగ్గర దగ్గర 18 యూఎస్ డాలర్ల వరకూ చార్జ్ చేస్తున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే.. 1277 చెప్పాలి. దానితో పోటీ పడుతున్న ఇతర నెట్ వర్క్ లు కూడా ఇంచుమించే ఇంతే ఛార్జ్ ను వసూలు చేస్తున్నాయి. ఇంత భారీ ఛార్జీలతో మనోళ్లు 5జ సేవల్ని వినియోగించటానికి సిద్ధంగా ఉండరని చెప్పక తప్పదు.
5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో డ్రైవర్ రహిత కార్లు.. ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్.. ఇంటర్నెట్ ఉపయోగించి ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ ఉపకరణాల్ని వినియోగించే వీలు ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఈ సేవలకు చైనాలో ఆదరణ ఎంత ఉంటుందన్న విషయానికి వస్తే. ఏడాది వ్యవధిలో 170 మిలియన్ల కస్టమర్లు 5జీ సేవల్లోకి కన్వెర్ట్ అవుతారన్న అంచనా వినిపిస్తోంది.