Begin typing your search above and press return to search.

వుహాన్ టు ఢిల్లీ: ఆరుగురు ఏమయ్యారు?

By:  Tupaki Desk   |   2 Feb 2020 12:53 PM IST
వుహాన్ టు ఢిల్లీ: ఆరుగురు ఏమయ్యారు?
X
రోనా వైరస్ కారణంగా చైనాలో మరణ మృందంగం కొనసాగుతోంది. ఈ వైరస్ పుట్టిన వుహాన్ లో ప్రజలను బయటకు వెళ్లనీయకుండా చైనా ప్రభుత్వం నిర్బంధించింది. వూహాన్ లో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో చిక్కుకున్నారు.

వూహాన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం తాజాగా భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపించింది. తొలుత ఈ విమానం ద్వారా 350మందిని ఢిల్లీకి తీసుకొస్తామని ప్రకటించారు. అయితే కేవలం 344మందిని మాత్రమే ఇండియాకు తీసుకొచ్చారు. మిగిలిన ఆరుగురు ఏమయ్యారన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

వూహాన్ లో మొత్తం 600 మంది భారతీయులున్నారని.. ఇందులో ఇండియాకు 400 మంది వస్తామని మోడీ సర్కారును అభ్యర్థించారు. అయితే తాజాగా తొలుత 350మందిని విమానంలో ఎక్కించారు. అందులో హైఫీవర్ తో అనుమానంగా కనపడ్డ ఆరుగురు విద్యార్థులను చివరిక్షణంలో విమానం నుంచి భారత ఇమిగ్రేషన్ అధికారులు దించేశారు. వారికి కరోనా వైరస్ సోకవచ్చన్న అనుమానంతో పరీక్ష కేంద్రాలకు పంపారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

ఇక వూహాన్ లో మిగిలిపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు మరో ప్రత్యేక విమానాన్ని చైనాకు పంపుతున్నారు.