Begin typing your search above and press return to search.
విశాఖలో కాల్పులు కలకలం .. 6మంది మావోయిస్టుల మృతి ,
By: Tupaki Desk | 16 Jun 2021 10:30 AM GMTవిశాఖ మన్యం భారీగా బులెట్ల శబ్ధాలు,కాల్పుల మోతతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విశాఖ ఏజెన్సీలో మరోసారి మావోయిస్టులకు పోలీసులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం వంపు పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రేహౌండ్స్ దళాలకు, మావోయిస్టులకు గంటల తరబడి ఈ ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు కీలకనేత కూడా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు ఘటనా స్థలంనుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య తీగలమెట్ట పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. రెగ్యులర్ కూబింగ్ లో భాగంగా పోలీసులు మావోయిస్టుల సంచారంపై జల్లెడ పడుతున్నారు. అయితే నిన్న రాత్రికి మావోయిస్టుల ఉన్న ప్రదేశం పై సమాచారం అందించింది. దీంతో ఆ ప్రాంతంలో గ్రే హౌండ్స్ దళాలు కూంబింగ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో పోలీసులు భారీగా మావోలు ఎదురు పడ్డారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో గ్రే హౌండ్స్ దళాలు ఎదురుకాల్పులు జరిపారు. రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల మోతతో అటవీ ప్రాంతం దద్ధరిల్లింది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. అనంతరం వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని తరలించారు. ఇంకా మావోయిస్టులు ఉన్నారనే దానిపై పోలీసులు కూంబింగ్ విసృతం చేపట్టారు. సరిహద్దుల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేపట్టారు. మృతుల్లో పలువురు మహిళా మావోయిస్టులున్నారు. ఘటనా స్థలంలో ఏకే 47, ఎస్ఎల్ఆర్, కార్బన్, తపంచాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో తెలంగాణకు చెందిన సందె గంగయ్య చనిపోయినట్లు సమాచారం.