Begin typing your search above and press return to search.
నిర్లక్ష్యానికి బాలుడి బలి
By: Tupaki Desk | 13 Feb 2019 4:54 AM GMTఇదో షాకింగ్ సంఘటన.. ప్రతి తల్లిదండ్రి తప్పక చూసి జాగ్రత్త పడాల్సిన వీడియో.. ఓ ఆరేళ్ల బాలుడు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగి ఓ పోల్ ను పట్టుకున్నాడు. కానీ అదే మృత్యుపాశమవుతుందని ఊహించలేదు. చుట్టూ పిల్లలు ఆడుకుంటున్నారు. అక్కడే ఉన్న ఎలక్రిక్ పోల్ ను పట్టుకున్న బాలుడు అలానే బిగుసుపోయాడు. కొద్ది సేపటికి విగత జీవిగా కింద పడిపోయాడు. అప్పటికీ కానీ తెలియలేదు.. ఆ పోల్ కు కరెంట్ సరఫరా అవుతుందని.. ఆ బాలుడు విద్యుత్ షాక్ తో చనిపోయాడని.. ఈ దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డు కావడంతో ఆ బాలుడి మరణం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
హైదరాబాద్ నర్సంగిలోని తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో గల పీబీఈఎల్ సిటీ అపార్ట్ మెంట్ల వద్ద బాలుడు విద్యుత్ షాక్ తో మరణించడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. బాలుడితోపాటు చాలా మంది పిల్లలు అక్కడ బంతితో ఆడుకుంటున్నారు. ఓ బాలుడు బంతి కొట్టగా అక్కడే ఉన్న పోల్ వద్ద పడింది. అప్పుడు ఆరేళ్ల బాలుడు పోల్ ను పట్టుకొని బంతి తీసుకునే ప్రయత్నం చేశాడు. పోల్ కు విద్యుత్ ప్రసరించడంతో అలానే అతుక్కుపోయాడు. కొద్దిసేపటికి కుప్పకూలిపోయాడు. ఆ పోల్ కు విద్యుత్ సరఫరా అవుతుందన్న విషయం తెలియక బాలుడు పట్టుకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి అపార్ట్ మెంట్ నిర్వాహకులపై 304 ఏ కింద నిర్లక్ష్యం - దురుసుగా ప్రవర్తించారని కేసులు నమోదు చేశారు. ఇక బాలుడి మరణంపై పీబీఈఎల్ సిటీ అపార్ట్ మెంట్ వాసులు ధర్నా నిర్వహించారు. గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకులు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని.. దీనికి బాధ్యత వహించి బాలుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి నిర్లక్ష్యానికి బాలుడు మరణించడానికి మండిపడ్డారు.