Begin typing your search above and press return to search.

అమెరికా ఏడారిలో చిన్నారి.. విషాదాంతం

By:  Tupaki Desk   |   15 Jun 2019 8:22 AM GMT
అమెరికా ఏడారిలో చిన్నారి.. విషాదాంతం
X
వలస బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయో తెలిపే సంఘటన ఇదీ.. నీటి కోసం అల్లాడి చనిపోయిన ఓ బాలిక దీన గాథ ఇదీ.. చుట్టూ ఎడారిలో తాగేందుకు నీరు లేక అలసి సొలసి భారతీయ బాలిక అసువులు బాసింది. అందరినీ కంటతడి పెట్టించే సంఘటన అమెరికాలోని అరిజోన ఎడారిలో చోటుచేసుకుంది.

గుర్ ప్రీత్ కౌర్ అనే ఆరేళ్ల బాలిక తన తల్లితో కలిసి మెక్సికోలో జీవిస్తోంది. ఆమెకు అక్కడ ఉపాధి కరువై అమెరికా వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే వీసాలు లేకపోవడంతో అక్రమంగా అమెరికాలోకి వెళ్లాలని అనుకుంది. ఇందుకోసం స్మగ్లర్లను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే స్మగ్లర్స్ తల్లీకూతుళ్లు ఇద్దరితోపాటు మరో ఐదుగురు భారతీయ వలసదారులను మంగళవారం ఉదయం అమెరికా సరిహద్దులోని భయంకరమైన అరిజోనా ఎడారి ప్రాంతంలో వదిలి వెళ్లారు. అక్కడి నుంచి అక్రమంగా అమెరికా వెళ్లండని వదిలేశారు. కానీ కొద్దిదూరం ప్రయాణించిన గురు ప్రీత్ కౌర్ కు దాహం వేసింది. దీంతో ఆమె తల్లికి మరో మహిళతో కలిసి నీటి కోసం వెళ్లింది.. దీంతో గురుప్రీత్ ను మిగతా వారి వద్ద వదిలి నీటి కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్లింది.

అయితే నీటి కోసం వెళ్లిన తల్లి ఓ మైలు దూరం వెళ్లి నీటి జాడ లేక అక్కడే తీవ్రమైన ఎండకు తల్లి సృహ తప్పి పడిపోయింది. ఇక కూతురు.. తల్లి నీరు తెస్తుందని చూసి చూసి ఎండకు సొమ్మసిల్లి పడిపోయింది.

తెల్లవారి అమెరికా సెక్యూరిటీ పెట్రోలింగ్ సిబ్బంది గురుప్రీత్ తల్లితోపాటు మరో మహిళ సృహతప్పి పడిపోయి ఉండడాన్ని చూసి వారికి ప్రాథమిక చికిత్స చేశారు. కోలుకున్న మహిళా తమ కూతురును అక్కడే వదిలేశామని పోలీసులను అక్కడికి తీసుకెళ్లింది. కానీ అప్పటికే చిన్నారి ఎండకు నీరు లేక వడదెబ్బకు గురై మృతి చెందింది.

ఇలా అమెరికాలోకి వెళ్లాలనుకున్న వారి కల నెరవేరలేదు. అమెరికా ఎడారిలో నీరు దొరక్క ఆ చిన్నారి మృతి చెందింది.ఎడారి కావడం.. నిలువ నీడ లేకపోవడం.. గుక్కెడు మంచినీరు కూడా దొరక్కపోవడంతో చిన్నారి చనిపోయింది. అమెరికాలోనే అత్యంత వేడిగా ఉన్న అరిజోనా ఎడారి లో ఇలా భారతీయ చిన్నారి మరణం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. పుట్టినరోజు ముంగిట ఆ చిన్నారి ప్రాణాలు పోవడం విషాదం నింపింది.