Begin typing your search above and press return to search.

ఏపీ లో దారుణం.. ఆరేళ్ల బాలిక పై అత్యాచారం

By:  Tupaki Desk   |   14 Dec 2019 7:47 AM GMT
ఏపీ లో దారుణం.. ఆరేళ్ల బాలిక పై అత్యాచారం
X
ఏపీలో చిన్నారులు, మహిళల పై అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష వేస్తామంటూ ఏపీ ప్రభుత్వం దిశ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన మరుసటి రోజే ఏపీలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపింది.

గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి లో ఈ దారుణం వెలుగు చూసింది. తల్లి అమ్మమ్మలతో కలిసి ఉంటున్న ఆరేళ్ల బాలికపై ఓ 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. భర్తతో విడిపోయి నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ తన కూతురును తల్లి వద్ద ఉంచి చదివిస్తోంది. ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలిక (6) యూకేజీ చదువుతోంది. వారి ఇంటి కింద పోర్షన్ లో లక్ష్మారెడ్డి(19) అనే యువకుడు ఇంటర్ చదువుతున్నాడు.

గురువారం మధ్యాహ్నం భోజనం చేసి తల్లి డ్యూటీకి వెళ్లింది. చిన్నారి అమ్మమ్మ రైతు బజారు వెళ్లగా.. బాలిక స్కూలు నుంచి అప్పుడే ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేనిది చూసిన లక్ష్మారెడ్డి బాలిక అత్యాచారానికి పాల్పడ్డాడు. కడుపులో నొప్పిగా ఉందని చిన్నారి తల్లికి చెప్పగా.. గట్టిగా అడిగేసరికి దారుణం వెలుగు చూసింది. వెంటనే కుమార్తె తో కలిసి తల్లి నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడి పై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

కాగా బాలిక పై జరిగిన దారుణం తో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. వెంటనే ‘దిశ చట్టం’ ప్రకారం నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశాయి. జగన్ ప్రభుత్వం ఎన్ని కఠినచట్టాలు తెచ్చినా ఆడపిల్లలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు.