Begin typing your search above and press return to search.

అలాంటి శానిటైజర్లు కరోనాని అడ్డుకోలేవు...ఏవి , ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   9 March 2020 1:30 PM GMT
అలాంటి శానిటైజర్లు కరోనాని అడ్డుకోలేవు...ఏవి , ఎందుకంటే ?
X
కరోనా వైరస్ ..ఈ మహమ్మారి వల్ల ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. రోజు రోజుకు కరోనా వైరస్ తీవ్రత మరింతగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 95 దెసలలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెంది , ఆ దేశాల ప్రజలని అతలాకుతలం చేస్తుంది. ఇక ఇప్పటికే ఈ వైరస్ దాడికి 3900 మంది మృత్యువాత పడ్డారు. ఈ కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు.

దీనితో ఈ కరోనా వైరస్ రాకుండా ఉండటానికి , ఎప్పటికప్పుడు హ్యాండ్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని డబ్ల్యూహెచ్ వో డాక్టర్లు ప్రకటించారు. హ్యాండ్ శానిటైజర్లలో 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. మిగతా పదిశాతం మరికొన్ని రసాయనాలు ఉంటాయి. అంతేకాకుండా ఆల్కహాల్, క్లోరిన్ రెండూ సూక్ష్మజీవులను నాశనం చేస్తాయని తెలిసిందే. ఈ కారణంతో మార్కెట్ లోని శానిటైజర్లకి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి.

అయితే , మార్కెట్ లో దొరికే అన్ని హ్యాండ్ శానిటైజర్లు వైరస్ నుండి పూర్తిగా కాపాడటంలో విఫలం అవుతున్నాయి. సెంటర్స్ ఆఫ్ డిస్జిస్ కంట్రోల్ (CDC) తెలిపిన ప్రకారం హ్యాండ్ శానిటైజర్స్ లో కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉండాలి. కాని మార్కెట్ లో ఆల్కహాల్ లేని కొన్ని రకాల హ్యాండ్ శానిటైజర్స్ దొరుకుతున్నాయి. అలాగే , ఆన్ లైన్ లో డిమాండ్ పెరిగిపోవటం వల్ల, అవి పని చేయకపోయినా సరే వాటిని కోనుగోలు చేసి,కరోనా భయంతో ఉపయోగిస్తున్నారు. పాపులర్ బ్రాండ్స్ హ్యాండ్ శానిటైజర్స్ పురెల్, జెర్మ్-ఎక్స్ వంటి వాటిలో కొన్ని సార్లు ఆల్కహాల్ కి బదులుగా బెంజల్కోనియం క్లోరైడ్ ని ఉపయోగిస్తారు. దీనితో ఈ శానిటైజర్లు వినియోగించిన వైరస్ పూర్తిగా చని పోతుంది అని చెప్పలేము. అలాగే అలాంటి వాటిని వాడటం కూడా అంత మంచిది కాదు. కానీ, కరోనా భయం తో ప్రజలు మాత్రం శానిటైజేర్ అయితే చాలు అన్నట్టుగా వాటిని వినియోగిస్తున్నారు.