Begin typing your search above and press return to search.

60 మంది ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు

By:  Tupaki Desk   |   2 Feb 2016 9:55 AM GMT
60 మంది ఆత్మహత్య చేసుకుంటామంటున్నారు
X
విద్యార్థుల ఆత్మహత్యలు... అందులోనూ దళితుల విద్యార్థలు ఆత్మహత్యలు దేశంలో చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో ఏకంగా 60 విద్యార్థులు తాము ఆత్మహత్య చేసుకుంటామని చెబుతుండడంతో దేశం షాక్ తింది.

బీహార్‌ లో 60 మంది దళిత విద్యార్థులు తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భువనేశ్వర్‌ లోని రాజధాని ఇంజనీరింగ్‌ కాలేజ్‌ లో చదువుతున్న వీరందరికీ ప్రభుత్వం ఉపకార వేతనం చెల్లించకపోవడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కళాశాల యాజమాన్యం పలుసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బీహార్ ప్రభుత్వం ఉపకార వేతనాలను చెల్లించలేదు. దీనితో ఈ విద్యార్థులు కళాశాలనుంచి, హాస్టల్‌ నుంచి బైటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. వీరిని కాలేజీల నుంచి, హాస్లళ్ల నుంచి గత నెల 8న బలవంతంగా బయటకు పంపించివేశారు.

బీహార్ లోని ఈస్ట్ చంపారన్ జాల్లాకు చిందిన 18 మంది, వెస్ట్ చంపారన్ కు చిందిన 42 మంది 2014 నాటి ప్రభుత్వ దళిత ఉపకార పథకంలో భాగంగా కాలేజీలో అడ్మిషన్లు పొందారు. వీరెవ్వరికీ స్టైఫండ్ జారీ కాలేదు. దీంతో ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ లేఖపై స్పందించిన ఎస్సీ - ఎస్టీ సంక్షేమ విభాగం కార్యదర్శి ఎస్ ఎం రాజు,సాధారణంగా ఉపకార వేతనాలు చెల్లింపులు ఆలస్యం కాదని, వీరి కేసులో ఏం జరిగిందన్న విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

కళాశాలకు బకాయిలు చెల్లించిన తరువాతే రావాలని ప్రిన్సిపాల్‌ చెబుతున్నారని... అయితే... తమకు ఉపకార వేతనాలు నిలిచిపోవడంతో ఆత్మహత్య తప్ప వేరే దారిలేదని విద్యార్దులు అంటున్నారు. బిజూపట్నాయక్‌ టెక్నికల్‌ యూనివర్శిటీ పరిధిలోని ఈ కళాశాలలో తమకు ఉచిత విద్య - భోజన - వసతి సదుపాయాలు కల్పించారని, 2015లో బీహార్‌ ప్రభుత్వం ఉపకార వేతనాలను కళాశాలకు పంపలేదని విద్యార్థులు చెబుతున్నారు.