Begin typing your search above and press return to search.

కరోనా లేటెస్ట్ అప్డేట్ ... తాజాగా మరో 60 కేసులు !

By:  Tupaki Desk   |   6 May 2020 7:34 AM GMT
కరోనా లేటెస్ట్ అప్డేట్ ... తాజాగా మరో 60 కేసులు !
X
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల పరిస్థితి ఆశ్చర్యం కలిగించేలా ఉంది. తెలంగాణలో చేస్తున్నట్టే ఏపీలో కూడా పూర్తిస్థాయి లాక్‌ డౌన్, పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా... రోజూ 60 దాకా కొత్త కేసులు దాదాపు 10 రోజుల నుంచి నమోదవుతుండటం ఆశ్చర్యం కలిగించే అంశమే. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా మరో 60 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బుధవారం బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

గత 24 గంటల్లో మరో 60 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 1777కి చేరింది. వీటిలో 12 కేసులు గుజరాత్‌ వీ, 1 కేసు కర్ణాటకది అని ప్రభుత్వం చెబుతోంది. కర్నూలు జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 14, గుంటూరు జిల్లాలో 12, విశాఖపట్నం జిల్లాలో 2.. తూర్పుగోదావరి జిల్లా, కడప జిల్లాల్లో ఒక్కో కేసు. రికవరీ కేసుల సంఖ్య 729గా ఉండగా... ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1012గా ఉంది. సోమవారం 10 వేల మందికి పైగా టెస్టులు చేసిన ప్రభుత్వం మంగళవారం 7782 మంది శాంపిల్స్ టెస్ట్ చేసింది. ఇప్పటివరకు 36 మంది కరోనాతో మృతిచెందారు.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 533 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 363 కేసులు ఉన్నాయి.. ఇక కృష్ణా జిల్లా కూడా 300 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా, ఏపీలో ఇప్పటివరకు 1,42,274 కరోనా టెస్టులు నిర్వహించారు.