Begin typing your search above and press return to search.
సైనిక పాలనలో చిక్కుకున్న 60 మంది భారతీయ టెక్కీలు
By: Tupaki Desk | 15 Sep 2022 2:30 PM GMTఐటీ ఉద్యోగాల పేరిట ఊరించారు. లక్షల జీతం అంటూ ఆశ చూపారు. మసాజ్ కంట్రీ 'థాయిలాండ్'లో ఐటీ జాబ్ అనగానే నమ్మి వెళ్లారు కొందరు భారతీయ టెకీలు. కానీ వీరిని దారుణంగా మోసం చేశారు.
ఐటీ ఉద్యోగాల కోసం థాయ్ లాండ్ వెళ్లే క్రమంలో సైనిక పాలనలో ఉన్న మయన్మార్ లో 60 మంది భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు చిక్కుకుపోయారు. 30 మందిని అక్కడి భారత ఎంబసీ అధికారులు కాపాడారు. మిగిలిన 30 మందిని కూడా రక్షించేందుకు భారత రాయబార కార్యాలయం చర్యలు చేపట్టింది.
ఈ 60మంది భారతీయ టెకీలు.. థాయ్ లాండ్ సరిహద్దుల్లోని పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ లేని 'మైవడ్డీ' అనే ప్రాంతంలో చిక్కుకున్నారు. ఈ ప్రాంతం పూర్తిగా సాయుధ తిరుగుబాటు వర్గాల చేతిలో ఉంటుంది.ఇదీ డిజిటల్ కుంభకోణాలకు కేంద్రం అని తెలుస్తోంది.
కొన్ని బోగస్ ఐటీ సంస్థలు ఇక్కడ నుంచి నకిలీ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు , డిజిటల్ కుంభకోణాలు నడుపుతుంటాయి. వాటి ఏజెంట్లు భారతీయులకు థాయ్ లాండ్లో ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తీసుకొని మైవడ్డీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే వదిలేస్తున్నారట..
ఇలా 60 మందికి పైగా భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మోసపోయి ఈ మైవడ్డీ ప్రాంతానికి చేరుకున్నారు. ఈప్రాంతం పూర్తిగా మయన్మార్ ప్రభుత్వ నియంత్రణలో లేదు అని.. అందుకే భారతీయ టెకీలను విడిపించడం చాలా కష్టం అవుతోందని భారత ఎంబసీ అధికారులు తెలిపారు. యాంగాన్ లోని భారత రాయబార కార్యాలయం భారతీయ టెకీల రక్షణ కోసం మయన్మార్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని తెలిపారు.
ప్రభుత్వ నియంత్రణ లేని ఈ ప్రాంతంలో వ్యాపారసంఘంలో వివిధ పరిచయాల ద్వారా భారతీయ పౌరులను రక్షించడానికి ఇతర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ మైవడ్డీ ప్రాంతంలో చిక్కుకున్న 30 మందికిపైగా భారతీయ టెకాలను రాయబార కార్యాలయం రక్షించింది. మిగిలిన వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకురావడానికి ఎంబసీ అన్నీ ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆయన తెలిపారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.