Begin typing your search above and press return to search.

60శాతం మగవాళ్లు సెక్స్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా?

By:  Tupaki Desk   |   21 Sep 2021 12:30 PM GMT
60శాతం మగవాళ్లు సెక్స్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారా?
X
శృంగారంలో ఆడ, మగ తృప్తిని పొందినా.. మగవారి ప్రొద్భలంతోనే అది సాధ్యమవుతుంది. అంటే ఇద్దరు వ్యక్తులు సుఖానికి కారణం మగవారిలో ఉన్న సామర్థ్యమే అని చెప్పొచ్చు. మగవారు శృంగారం ఎంత బాగా చేస్తే వారి సంతోషం అంత రెట్టింపు అవుతుంది. అయితే మగవారిలో శృంగారం చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా ఉండాలి. చాలా మంది మగాళ్లు ఇతర విషయాల్లో బలప్రదర్శన చేసినా శృంగారం విషయంకొచ్చేసరికి బలహీనులవుతారు. సెక్స్ విషయంలో సరైన అవగాహన లేకపోవడంతో కొంత మంది మగాళ్లు తమ భాగస్వామిని సరైన విధంగా తృప్తిపరచలేకపోతున్నారు. అంతేకాకుండా కొందరికి స్కలన సమస్యలు తీవ్రంగా ఉండడంతో వెంటనే వారిలో ఉన్న కోరికలు ఆవిరైపోతున్నాయి. దీంతో తమ భాగస్వామి తీవ్ర నిరాశకు చెందుతోంది.

భారతదేశంలో 60 శాతం మంది మగాళ్లలో శీఘ్ర స్థలన సమస్యలున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా శీఘ్రస్థలన సమస్యకు ప్రధాన కారణం ఒత్తిడి అని మానసికన నిపుణులు అంటున్నారు. ఈరోజుల్లో చాలా మంది మగాళ్లు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. దీంతో తమలో తామే ఒత్తిడిగా ఫీలవడంతో వారిలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. కొందరిలో సెక్స్ కోరికలు అమితంగా ఉన్నా స్కలన సమస్యలు ఉండడంతో వారి భాగస్వామి ముందు చులకన అయిపోతున్నారు.

స్కలనం వెంటనే అయిపోవడానికి ఒత్తిడి మాత్రమే కారణం కాదు. అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువగా హస్తప్రయోగం చేయడం కూడా అనుకోకుండా భావప్రాప్తి పొందే అవకాశం ఉంది. మనలోని కోరికలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో కొందరు తట్టుకోలేక హస్తప్రయోగానికి అలవాటు పడుతారు. హస్తప్రయోగంతో అప్పటికప్పుడు తృప్తి చెందినా దీర్ఘకాలంగా మాత్రం సమస్యలు వస్తాయని అంటున్నారు. కానీ కొందరు అవేమీ పట్టించుకోకుండా హస్తప్రయోగానికి అలవాటు పడి సమస్యలు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల స్థలన సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉంది.

చాలామందికి సెక్స్ లో పాల్గొన్న సమయంలో ఎక్కువ సేపు చేయాలని ఉంటుంది. కానీ కొందరికి వెంటనే భావప్రాప్తి కలుగుతుంది. అంటే కోరికలు విపరీతంగా ఏర్పడి వారిలో ఉత్తేజిత కారకాలు ఎక్కువగా విడుదలవుతాయి. దీంతో వెంటనే పడిపోతుంది. అయితే ఒక క్రమ పద్ధతిలో నిదానంగా ప్రేమతో చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా భాగస్వామితో ఫోర్ ప్లే విధానాన్ని ఉపయోగించడం కూడా చాలా సేపు సెక్స్ చేయడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఇక.. మధుమేహ వ్యాధిగ్రస్థులకు, హైపోథైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నవారికి, టెస్టోస్టిరాన్ స్థాయిలు తక్కువ ఉన్నవారికి, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి కూడా స్ఖలన సమస్యలు వస్తున్నాయి. అయితే వీరు వాడే మెడిసిన్ తో వారిలో సామర్థ్యం తక్కువగా ఏర్పడిన ఈ సమస్య వస్తుందని కొందరు అంటున్నారు. కానీ ఈ వ్యాధులున్న అందరిలోనే స్థలన సమస్య లేదు. ఇన్ఫెక్షన్ తీవ్రత భట్టి వారిలో సమస్య తీవ్రత ఉంటోంది. కొందరు ఈ వ్యాధుల నుంచి బయటపడడానికి అనేక రకాల మెడిసిన్ష్ వాడుతుంటారు. అలా మెడిసిన్ వాడుతున్న క్రమంలో వారిలో శక్తి కోల్పోయిన శీఘ్రస్థలనం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

లైంగిక ప్రేరణ లేకపోవడం, జీవిత భాగస్వామితో సన్నిహితంగా మెలగకపోవడంకూ ఓ కారణం కావచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో ప్రాబ్లం వల్ల మాట్లాడుకోకపోవడంతో ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం కోసం సెక్స్ కు దూరంగా ఉండే పరిస్థితి వస్తోంది. దీంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి చాలా రోజులు లైంగిక క్రీడను దూరం చేసుకుంటున్నారు. ఆ తరువాత వెంటనే కలయిక వల్ల వెంటనే స్థలనం అయిపోతుంది. ఇక కొందరిలో సెక్స్ కు ప్రేమగా కాకుండా ఏదో ఒక పని చేసి వెళ్లిపోవాలి అన్నట్లుగా చేయడం వల్ల కూడా శీఘ్రస్థలన సమస్యకు దారి తీస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.