Begin typing your search above and press return to search.

ఒక్క డోసుతో తొలగనున్న 60 శాతం ముప్పు !

By:  Tupaki Desk   |   25 Jun 2021 10:30 AM GMT
ఒక్క డోసుతో తొలగనున్న 60 శాతం ముప్పు !
X
కరోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సినేషన్ మాత్రమే స‌రైన మందు అని అంద‌రూ భావిస్తున్నారు. క‌రోనా మహ‌మ్మారి నుంచి ప్ర‌పంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మొదటి వచ్చి పోగానే , సెకండ్ వేవ్ వచ్చింది, ప్రస్తుతం సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అప్పుడే థర్డ్ వేవ్ గురించి చర్చ జరుగుతుంది. ప్రజలు ప్రాణ భ‌యంతోనే ప్ర‌జ‌లు జీవ‌నం సాగిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డంతో కొంత భ‌యం త‌గ్గిన‌ప్ప‌టికీ, వైర‌స్ వేరియంట్ లు భ‌య‌పెడుతున్నాయి. వృద్దులపై వ్యాక్సిన్ ఏ మేర‌కు ప‌నిచేస్తున్న‌ది అనే విష‌యంపై యూనివ‌ర్శిటి కాలేజ్ ఆఫ్ లండ‌న్ ప‌రిశోధ‌కులు ప‌రిశోధ‌న‌లు చేశారు. 60 ఏళ్లు పైబ‌డిన వృద్దులు సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవ‌డం వ‌ల‌న 60 శాతం మేర ముప్పు త‌ప్పుతుంద‌ని ప‌రిశోధ‌కుల ప‌రిశోధ‌న‌లో తేలింది.

క‌రోనాపై ఫైజ‌ర్‌, కోవీషీల్డ్ టీకాలు స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని, క‌నీసం ఒక్క డోసు తీసుకుంటే 28-34 రోజుల్లో 56 శాతం, 38-45 రోజుల త‌రువాత 62 శాతం క‌రోనా బారిన ప‌డే ముప్పు త‌గ్గుతంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే .. టీకాలపై నెలకొన్న భయాలు కొందరికి ఆందోళనకరంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకుంటే చ‌నిపోతామ‌నే భ‌యంతో వివిధ రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు టీకాలకు దూరంగా ఉంటున్నారు. మ‌హారాష్ట్ర‌, ఒడిశా, క‌ర్ణాట‌క‌, ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని గిరిజ‌న తండాలు, మారుమూల ప్రాంతాల‌లో నివ‌సించే ప్ర‌జ‌లు కోవిడ్ వాక్సిన్ తీసుకోవ‌డానికి విముఖ‌త చూపుతున్నారు. తాము ఊళ్ళో ఉంటే వ్యాక్సిన్ వేసుకోవాల్సి వ‌స్తుందేమోన‌నే భ‌యంతో ఏకంగా ఇళ్ల‌కు తాళాలు వేసి వెళ్ళిపోతున్న సంఘ‌ట‌న‌లు వెలుగుచూస్తున్నాయి. కొన్ని ప్రాంతాల‌లో అధికారులు తండాల ప్ర‌జ‌ల‌తో ప్ర‌త్యేక స‌మావేశాలు నిర్వహించి, వ్యాక్సిన్‌పై వారికి అవ‌గాహ‌న కల్పిస్తున్నారు. అయితే ఈ విధానం పెద్ద‌గా ఉప‌యోగ‌పడట్లేదు. కరోనా వ్యాక్సిన్ ప్ర‌భావాల‌పై అనుమానాలు ఎక్కువ‌గా ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. తండాల‌లోని ప్ర‌జ‌లు వ్యాక్సిన్ తీసుకునేలా చేయ‌డానికి ఆయా జిల్లాల అధికారులు ఎక్క‌డిక‌క్క‌డ స‌రికొత్త కార్య్ర‌క‌మాలు రూపొందిస్తున్నారు.