Begin typing your search above and press return to search.
47.. 48 అంతస్తులలో ఏపీ సీఎం ఛాంబర్..?
By: Tupaki Desk | 7 Aug 2015 6:58 AM GMTభూమి పూజ మాత్రమే పూర్తయి.. ఇంకా శంకుస్థాపన మొదలు పెట్టని ఏపీ రాజధానికి సంబంధించి ఆసక్తికర కథనాలకు కొదవలేదు. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్లాన్లు సగటు ఆంధ్రుడికి ఆనందాన్ని కలిగించేలా ఉంటున్నాయి. అయితే.. ఇప్పుడు చెబుతున్న ప్లాన్లు ఎప్పటికి పూర్తి అయ్యను? ఎప్పటికి అందుబాటులోకి వచ్చేనన్న విషయాల్లో చాలానే సందేహాలున్నాయి.
అయినా.. వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరూ లేదు. కలలు కనటం.. వాటిని నెరవేర్చుకోవటం ఒక క్రమపద్ధతిలో సాగాలి. కానీ.. ఏపీ సర్కారు తీరు మాత్రం వరుస కలలు కనటంలో మాత్రమే ఉన్నట్లుగా కనిపిస్తోంది.
త్రీడీ ఎఫెక్ట్ తో కళ్లు చెదిరిపోయే ఛాయాచిత్రాలతో రాజధాని రంగుల కలను ఆవిష్కరిస్తున్న ఏపీ సర్కారు.. తాజాగా మరో కలను ఆవిష్కరించింది. ఏపీ కొత్త రాజధానిలో.. ఏపీ పాలనకు గుండెకాయ లాంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయం భారీగా ఉండాలని భావిస్తోంది. ఇందుకోసం 60 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విశాలమైన గదులతో.. రాజధాని అమరావతికి తలమానికంగా ఉండేలా దీన్ని రూపొందించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని చెబుతున్నారు. 60 అంతస్తులలో కట్టే ఏపీ సచివాలయంలో.. ముఖ్యమంత్రి ఛాంబర్ 47వ అంతస్తులో కానీ.. 48 అంతస్తులో కానీ ఉండే వీలుంటుందని చెబుతున్నారు.
స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మించే ఈ భవన నిర్మాణ బాధ్యతల్ని అప్పగించేందుకు ఏపీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతా బాగానే ఉందని కనిపిస్తున్నా.. సామాన్యుడికి మాత్రం చాలానే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భారీ అంతస్తుల బిల్డింగ్ ను చంద్రబాబు నాయుడు మోజుతో కట్టిస్తున్నా.. రేపొద్దన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తి ఏపీకి సీఎం అయి.. ఆయన గారికి వాస్తు లాంటి నమ్మకాలతో పాటు.. జాతకాల మీద విపరీతమైన గురి ఉంటే.. ఆయన జాతకంతో ఈ భారీ బిల్డింగ్ కానీ సూట్ కాకపోతే పరిస్థితేంటి? ఇంత భారీ కట్టటం కూడా ఎందుకు పనికి రాకుండా పోతుందా..? ఇలాంటి అంశాల్ని కూడా దృష్టిలో ఉంచుకొని భారీ భవనాల్ని రూపొందిస్తే మంచిదేమో. కనీసం.. ప్రజాధనం కొంతమేర అయినా ఆదా అయ్యే ఛాన్స్ ఉంటుంది.