Begin typing your search above and press return to search.
సర్జరీ జరుగుతుండగా వంట చేసిన బామ్మ!
By: Tupaki Desk | 13 Jun 2020 12:30 AM GMTఓ వైపు వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేస్తుంటే.. మరో వైపు రోగి ఎంచక్కా పాటలు పాడటమో.. ఏదైనా వాయిద్యాన్ని వాయించటం లాంటి ఘటనలు చాలా ఉన్నాయి. కానీ, ఈ వార్త అందుకు భిన్నమైనది. ఓ బామ్మ మాత్రం తనకు బ్రెయిన్ ఆపరేషన్ జరుగుతుండగానే మంట లేకుండా వంట చేసేసింది. ఈ సంఘటన ఇటలీలో జరిగింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే.. కొద్ది రోజుల క్రితం అన్‌కోనా సిటీలోని రీయూనిటీ హాస్పిటల్‌లో ఓ 60ఏళ్ల బామ్మకు బ్రెయిన్ సర్జరీ జరిగింది.
అమె టెంపరల్ లోబ్ పని తీరును గమనించేందుకు ఆమెను ఏదైనా పని చేస్తుండమని పురమాయించారు వైద్యులు. దీంతో ఆమె వంట చేయటానికి సిద్ధపడింది. ఓ వైపు వైద్యులు సర్జరీ చేస్తుంటే మరో వైపు ఆమె 90 స్టఫ్‌డ్ ఆలీవ్స్‌ను తయారు చేసింది. ప్రస్తుతం బామ్మ బ్రెయిన్ సర్జరీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.గ్రేట్ చెఫ్.. ఆమె ఓ వంటల మహారాణి.. ఏదో హర్రర్ సినిమా చూసినట్లుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు