Begin typing your search above and press return to search.
6వేల మంది రష్యా సైనికులు మరణించారన్న ఉక్రెయిన్
By: Tupaki Desk | 2 March 2022 4:30 PM GMTరష్యా దండయాత్రతో ఉక్రెయిన్ సేనలు తగ్గేదేలే అన్నట్టుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇరు సైన్యాల మధ్య కొనసాగుతున్న భీకరపోరులో రష్యాకు కూడా భారీగానే ప్రాణ నష్టం వాటిల్లుతున్నట్టుగా ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. గత ఆరు రోజుల్లో దాదాపు 6వేల మంది రష్యన్ సైనికులు మృతిచెందినట్టుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.
రష్యాకు చెందిన 30 విమానాలు, 31 హెలిక్యాప్టర్లు, 211 ట్యాంకులు, 862 సాయిధ శకటాలు, 355కి పైగా వాహనాలు, 60 ఇంధన ట్యాంకులు, రెండు పడవలు, తొమ్మిది డ్రోన్లను ధ్వంసం చేసి రష్యాను దెబ్బతీసినట్టు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది.
ఇక దక్షిణ ఉక్రెయిన్ లోని ఖెర్సాన్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు రష్యా పేర్కొంది. ఖెర్సాన్ ఓడరేవు పట్టణం కావడంతో కీలక స్థావరంగా ఉంది.
ఖార్కీవ్ లో ఈరోజు ఉదయం రష్యా బాంబు దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందినట్టు సమాచారం. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్, కరాజిన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన భవనాలపై ఈ క్షిపణి దాడి చేశారు.
ఉక్రెయిన్ పై యుద్ధానికి ఉసిగొల్పిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. తమ సైనికులకు కనీసం వసతులు కల్పించలేదని అర్థమవుతోంది. రష్యన్ సైనికులకు తిండి లేక ఆకలితో పోరాడలేక తాజాగా ఉక్రెయిన్ లోని అతిపెద్ద రెండో నగరం ఖార్గివ్ లో లొంగిపోయినట్టు సమాచారం. ఈ మేరకు ఖార్గివ్ గవర్నర్ 'ఓలే సినెహుబువ్' ఫేస్ బుక్ లో పోస్టు చేసిన సైనికుల ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రష్యాన్ సైనికులు యుద్ధం చేయలేక ఆకలితో అలమటిస్తున్నారని గవర్నర్ తెలిపారు. ఇక వారు రష్యా సైన్యంతో సంబంధాలు కోల్పోయారు. ఎందుకు యుద్ధం చేస్తున్నారో? ఎక్కడ చేయాలో? ఎలా చేయాలో వారికి అర్థం కాలేదు. ఆకలితో అలమటిస్తూ ఇక యుద్ధం చేయలేమని ఉక్రెయిన్ సైన్యానికి తాజాగా లొంగిపోయారని గవర్నర్ తెలిపారు.ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టి మూడు రోజులు అవుతున్నా ఈ సైనికులకు కనీసం రష్యన్ సైన్యం ఆహారాన్ని కూడా అందివ్వలేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధం చేయలేకవారు లొంగిపోయారు.