Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఆ 61 స్కూల్ విద్యార్ధులకి కరోనా పరీక్షలు

By:  Tupaki Desk   |   4 March 2020 10:00 AM GMT
హైదరాబాద్ లో ఆ 61 స్కూల్  విద్యార్ధులకి కరోనా పరీక్షలు
X
భారత్‌ లో కరోనా వైరస్ కొద్దికొద్దిగా తన పంజా విసురుతోంది. ముందుగా కొద్ది రోజుల క్రితం కేరళ రాష్ట్రంలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో కేరళ వైద్యులు వెంటనే అప్రమత్తమై దానిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే మన దేశానికి చెందిన పలువురు ఇతర దేశాలకు వెళ్లి వస్తుండడంతో వారినుంచి కరోనా వైరస్ క్రమక్రమంగా ఇతరులకు కూడా విస్తరిస్తోంది. సోమవారం మనదేశంలో ముగ్గురికి కరోనా వైరస్ ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఇక బుధవారం ఉదయానికి మొత్తం దేశ వ్యాప్తంగా 21 మంది బాధితులు ఉన్నట్టు లెక్క తేల్చారు. అధికారికంగానే వీరి సంఖ్య 21 వరకు ఉందంటే.. అనధికారికంగా మనదేశంలో కరోనా బాధితలు మరికొంత మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.

ఇకపొతే , హైదరాబాద్ లో కూడా కరోనా కోరలు చాచుతుండటం తో విద్యాశాఖ కూడా అప్రమత్తమైంది. విద్యార్థుల్లో అవగాహన కల్పించే చర్యల్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను బుధవారం నుంచి విద్యార్థులకి తెలియజేస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మరుగు దొడ్లకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు శుభ్రపరుచుకోవడం వంటి విషయాలను వివరిస్తున్నారు.

ఇక కరోనా వైరస్ సోకి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి నివాసం ఉన్న ప్రాంతంలోని పాఠశాలలపై రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న61 పాఠశాలల్ని ఎంపిక చేసి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆ స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వ్ర జ్వరంతో బాధపడుతున్న ఐదుగురు విద్యార్థులను ఉపాధ్యాయులు నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇక మరోవైపు కరోనా పై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలంగాణ సర్కార్ చెప్తుంది. ఈ కరోనా వైరస్ కి ఇంకా మందు కనిపెట్టలేదు కాబట్టి ..ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలని కోరుతుంది. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని చెప్తుంది.