Begin typing your search above and press return to search.

6:30 PM శివాజీ పార్క్ లో ల‌తాజీ అంత్య‌క్రియ‌లు

By:  Tupaki Desk   |   6 Feb 2022 9:31 AM GMT
6:30 PM శివాజీ పార్క్ లో ల‌తాజీ అంత్య‌క్రియ‌లు
X
లతా మంగేష్కర్ మరణానంత‌రం సినీరాజ‌కీయ సెల‌బ్రిటీల నుంచి సాధార‌ణ అభిమానుల నుంచి సంతాపం వెల్లువెత్తుతోంది. లైవ్ అప్ డేట్ ల‌తో జాతీయ మీడియా హోరెత్తుతోంది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కాసేప‌ట్లో ల‌తాజీ ఇంటికి భౌతిక ఖాయాన్ని త‌ర‌లిస్తున్నారు. ఇక‌ సాయంత్రం 6:30 గంటలకు శివాజీ పార్క్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ల‌తాజీ మృతికి ముందు కొన్ని వారాల పాటు వెంటిలేటర్ పై ఉన్నారు. కానీ జనవరి 28న మెరుగుదల సంకేతాలను చూపించడంతో ఆమెను వెంటిలేటర్ నుండి తొలగించారు. శనివారం ఆమె ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించడంతో మ‌ళ్లీ వెంటిలేటర్ పై ఉంచారు. నేటి ఉద‌య‌మే ల‌తాజీ మ‌ర‌ణ వార్త వినాల్సి వ‌చ్చింది. అటుపై అన్ని వర్గాల నుంచి నివాళులర్పించడం ప్రారంభమైంది.లతా మంగేష్కర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

హోంమంత్రి అమిత్ షా .. కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ.. రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం రెండు రోజుల జాతీయ సంతాప దినాలుగా ప్ర‌క‌టించారు. గౌరవ సూచకంగా రెండు రోజుల పాటు జాతీయ జెండాను సగం మాస్ట్ లో ఎగురవేయాలని ప్రభుత్వ వర్గాలు ప్ర‌క‌ట‌న జారీ చేశాయి. లతా మంగేష్కర్ మరణంపై సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆ మేర‌కు ట్వీట్ చేసింది. భార‌త‌దేశ సినీప‌రిశ్ర‌మ‌ల చ‌రిత్ర‌లో 30 వేల పాట‌లు పాడి గిన్నిస్ రికార్డుల్లో చోటు ద‌క్కించుకున్న మేటి గాయ‌ని ఇక లేరు అన్న‌ది ప్ర‌పంచం జీర్ణించుకోలేనిది.